Share News

TDP : వైసీపీ భూకబ్జాలపై ఫిర్యాదులు

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:49 AM

భూ దురాక్రమణలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వినతులు స్వీకరించారు.

TDP : వైసీపీ భూకబ్జాలపై ఫిర్యాదులు

  • టీడీపీ గ్రీవెన్స్‌కు పోటెత్తిన బాధితులు

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): భూ దురాక్రమణలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ వినతులు స్వీకరించారు. ఇప్పటికీ రెవెన్యూ, పోలీస్‌ అధికారులు వైసీపీ నేతలకు తొత్తులుగా పని చేస్తున్నారని, తమ భూమిని ఆక్రమించుకుని, దాడులకు తెగబడ్డారని విశాఖ జిల్లా నక్కవానిపాలానికి చెందిన ధర్మాల ఆదిలక్ష్మి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి, తమ భూమి తమకు దక్కేలా చూడాలని వేడుకున్నారు. తాము కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాక, మారణాయుధాలతో దాడి చేసి తన అన్నను దారుణంగా చంపారని కడప జిల్లా యాదవాపురానికి చెందిన ఆదిమూలం వెంకటేశ్‌ ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. తన పొలానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, భూమిని కొట్టేయాలని కుట్ర చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన మారసాని సాంబయ్య కోరారు. విశాఖ-చెన్నై కారిడార్‌ భూసేకరణలో తన ఇంటిని పూర్తిగా కోల్పోతున్నందున తగిన పరిహారం ఇప్పించాలని విశాఖ జిల్లా మూలపర్రుకు చెందిన గంపా అమ్మాణి కోరారు.

Updated Date - Nov 24 , 2024 | 04:53 AM