Share News

KTR: అది మా తప్పేనంటూ ఒప్పుకున్న కేటీఆర్

ABN , Publish Date - May 20 , 2024 | 01:21 PM

అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇల్లందు పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. మార్పు కావాలని ఓటేసిన పాపానికి కాంగ్రెస్ వైఖరి జనాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగులు, యువత దూరమయ్యారన్నారు.

KTR: అది మా తప్పేనంటూ ఒప్పుకున్న కేటీఆర్

భద్రాద్రి కొత్తగూడెం: అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇల్లందు పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. మార్పు కావాలని ఓటేసిన పాపానికి కాంగ్రెస్ వైఖరి జనాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగులు, యువత దూరమయ్యారన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారంతో బీఆర్ఎస్‌కు నష్టం వాటిల్లిందన్నారు. పదేళ్ల మా పాలన గురించి చెప్పుకోవటంలో వైఫల్యం మా తప్పేనని కేటీఆర్ అన్నారు. 24 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన అవకాశాలు కల్పించినా చెప్పుకోలేక పోయామన్నారు.

Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..


మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు.. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ అన్నారు. ‘‘3 మెడికల్ కాలేజ్‌లున్న తెలంగాణలో 33 మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశాం. కొత్తగూడెం, ఖమ్మంలో మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశాం. ప్రమాణ స్వీకారం కాగానే రెండు లక్షల రుణమాఫీ అన్న రేవంత్ వాగ్దానం ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలి. పచ్చి అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి కర్రు కాల్చి వాత పెట్టే బాధ్యత విద్యావంతులదే. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న రేవంత్ రెడ్డి భర్తీ చేశారా? ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలి. గోల్డ్ మెడలిస్ట్ రాకేష్ రెడ్డి కావాలా.. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన బ్లాక్ మెయిలర్ కావాలా? ఆలోచన చేయాలి’’ అని కేటీఆర్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. ఫోటో గ్యాలరీ

తిరుపతి గంగమ్మ జాతర దృశ్యాలు.. ఫోటో గ్యాలరీ

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

Read Latest Telangana News and National News

Updated Date - May 20 , 2024 | 01:21 PM