Share News

NRI Dr Lokesh: ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ సీఎంను దూషించారని కేసు.. ఢిల్లీలో అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - May 21 , 2024 | 07:42 AM

ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు(NRI Dr Lokesh) మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ(delhi) ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

NRI Dr Lokesh: ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ సీఎంను దూషించారని కేసు.. ఢిల్లీలో అడ్డుకున్న పోలీసులు
The case of NRI Dr Lokesh

ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌కు(Vuyyuru Lokesh Kumar) మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా ఆయనను ఢిల్లీ(delhi) ఎయిర్ పోర్టు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే దీనికి ముందు ఆదివారం గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ముందస్తు అరెస్ట్ నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ వెళ్లిన డాక్టర్ లోకేష్‌ను పోలీసులు(police) అడ్డుకున్నారు.

అయితే లోకేష్ సీఎం జగన్‌ను దూషించారని పోలీసులు(police) కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. ఆ క్రమంలోనే గత రాత్రి డాక్టర్ లోకేష్‌కు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. దీంతోపాటు ఈనెల 30న హాజరు కావాలని కూడా తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేయడంతో డాక్టర్ లోకేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు.


ఎలాంటి అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్నారన్న ఆరోపణలపై గన్నవరం ఎయిర్‌పోర్టు(gannavaram airport)లోని ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు ఉయ్యూరు లోకేశ్‌ను ఆదివారం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. అమెరికా పౌరసత్వం పొందిన డాక్టర్ లోకేష్ అమెరికా వెళ్లే క్రమంలో ఢిల్లీ చేరుకునేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అతన్నిచెక్ ఇన్ చేస్తున్నప్పుడు విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతని సామాను తనిఖీ చేసి శాటిలైట్ ఫోన్‌ను గుర్తించారు.


భారత్‌లో ఆ ఫోన్‌ను ఆపరేట్ చేయడానికి సంబంధిత శాఖ నుంచి అతనికి ఎలాంటి అనుమతి లేదని వెల్లడించారు. అనంతరం అతడిని గన్నవరం పోలీసులకు అప్పగించారు. ఆ క్రమంలో తాను వర్జీనియాలో ఫోన్‌ను కొనుగోలు చేసి తనతో పాటు భారత్‌కు తీసుకొచ్చానని పోలీసులకు చెప్పారు. విచారణకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో విడుదల చేశారు. తరువాత అతను ఢిల్లీకి విమానంలో బయలుదేరారు.


ఇది కూడా చదవండి:

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Iran President: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి.. చమురు, గోల్డ్, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం?

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 08:51 AM