Share News

Threatening Calls : పవన్‌కు బెదిరింపు కాల్‌

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:29 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి అభ్యంతరకర భాషతో మాట్లాడుతూ ఓ ఆగంతకుడు ఓఎస్డీ వెంకటకృష్ణకు కాల్‌ చేశాడు.

Threatening Calls : పవన్‌కు బెదిరింపు కాల్‌

  • డిప్యూటీ సీఎం ఓఎస్డీకి ఫోన్‌ చేసిన ఆగంతకుడు

  • నిందితుడు తిరువూరు వాసిగా గుర్తింపు

  • కొద్దిరోజుల క్రితం హోంమంత్రికీ బెదిరింపులు

విజయవాడ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి అభ్యంతరకర భాషతో మాట్లాడుతూ ఓ ఆగంతకుడు ఓఎస్డీ వెంకటకృష్ణకు కాల్‌ చేశాడు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనితకూ ఈ తరహా కాల్‌ వెళ్లింది. ఇద్దరికీ కాల్స్‌ చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన నక్కా మల్లికార్జునరావుగా గుర్తించారు. నిందితుడు ఎంజీ రోడ్డు నుంచి ఈ ఫోన్‌ కాల్స్‌ చేసినట్టు గుర్తించారు. ఈ రెండు బెదిరింపు కాల్స్‌పై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి. దీంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంజీ రోడ్డును జల్లెడపట్టారు. స్థానికులను విచారించగా అటువంటి వ్యక్తి ఇక్కడెవరూ లేరని స్థానికులు చెప్పారు. దీంతో బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. పోలీసులకు లొకేషన్‌ ట్రాక్‌ అయిన కాసేపటికే స్విచ్చాఫ్‌ చేశాడు. వాస్తవానికి మల్లికార్జునరావు ఈ ఫోన్‌ చేశాడా, ఎవరైనా అతడి పేరు మీద సిమ్‌కార్డు తీసుకుని ఫోన్‌ చేశారా అన్న విషయం నిందితుడు అరెస్టయిన తర్వాత తేలనుంది. కాగా, డిప్యూటీ సీఎం ఓఎస్డీకీ బెదిరింపు కాల్‌ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. నిందితుడిని పట్టుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు.

Updated Date - Dec 10 , 2024 | 03:29 AM