Vijayawada: కృష్ణమ్మ వేసిన యమపాశం.. ఎడబాసిన పేగుబంధం..
ABN , Publish Date - Jan 29 , 2024 | 01:12 PM
వాళ్లు నలుగురూ స్నేహితులు.. సెలవు రోజు కావడంతో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నారు. అందరూ కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు.
వాళ్లు నలుగురూ స్నేహితులు.. సెలవు రోజు కావడంతో సరదాగా ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నారు. అందరూ కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లను చూసి సంబరంతో మురిసిపోయారు. లోతు గమనించకుండా నీటిలోకి దిగడంతో గుంటలోకి కూరుకుపోయారు. ఊపిరాడక ముగ్గురు మృత్యువాతపడ్డారు. చేదు వాస్తవం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంత వరకు ఆనందంగా గడిపిన తమ కుమారులు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక కుప్పకూలిపోయారు. బాగా చదివి ఎంతో జీవితాన్ని చూడాల్సిన తమ ఇంటి దీపాలు ఇలా కొడిగట్టుకుపోవడం చూసి గుండెలు బాదుకున్నారు. ఒక్కసారి లేవరా కన్నా.. అంటూ రోదించిన తీరు అరణ్యరోదనలే అయ్యాయి. ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
విజయవాడ పటమట కెనరా బ్యాంక్ వీధికి చెందిన గగన్, ప్రశాంత్‌లు, కరణంగారి వీధికి చెందిన కార్తీక్, కానూరు సనత్‌నగర్‌కు చెందిన షారూక్ నలుగురు స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో అందరూ కలిసి సైకిల్ మీద యనమలకుదురు సమీపంలోని కృష్ణా నది లోపలికు సుమారు 2.5 కిలో మీటర్లు వెళ్లారు. కాసేపు ఆడుకున్నారు. షారూక్ ఫొటోలు దిగుతుండగా ప్రశాంత్, కార్తీక్, గగన్ నీళ్లలోకి దిగారు. లోతు తెలియకపోవడంతో గుంతలోకి కూరుకుపోయి మృతి చెందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.