Train: రైలు పొడిగింపు.. కాచిగూడ-మంగళూరు రైలు ఇక మురడేశ్వర్ వరకు..
ABN , Publish Date - Oct 12 , 2024 | 01:11 PM
గుత్తి మీదుగా వెళ్లే కాచిగూడ- మురడేశ్వర్-కాచిగూడ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12789/90) రైలును మురడేశ్వర్ వరకూ పొడిగించినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-మంగళూరు ఎక్స్‌ప్రెస్(Kachiguda-Mangalore Express)ను ఈ నెల 11 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలు గమ్యాన్ని 12వ తేదీ నుంచి పొడిగించినట్లు వివరించారు.
గుంతకల్లు(అనంతపురం): గుత్తి మీదుగా వెళ్లే కాచిగూడ- మురడేశ్వర్-కాచిగూడ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12789/90) రైలును మురడేశ్వర్ వరకూ పొడిగించినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-మంగళూరు ఎక్స్‌ప్రెస్(Kachiguda-Mangalore Express)ను ఈ నెల 11 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలు గమ్యాన్ని 12వ తేదీ నుంచి పొడిగించినట్లు వివరించారు. ఈ రైలు మంగళూరు తర్వాత సూరత్కల్, ముల్కి, ఉడిపి, బర్కుర్, కుండపుర, మూకాంబికా నగర్ బైండూరు, భత్కల్ స్టేషన్ల మీదుగా మురడేశ్వర్‌కు చేరుకుంటుందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: ఇక మీ ఇష్టం..! నేనేం చేయలేను
గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం గుంతకల్లు మీదుగా బెళగావి-మణుగూరు-బెళగావి(Belagavi-Manuguru-Belagavi) మధ్య వచ్చే సంవత్సరం మార్చి ఆఖరు వరకూ వారానికి నాలుగు రోజులు నడిచే ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బెళగావి-మణుగూరు ప్రత్యేక రైలు (నెం. 07335)ను ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 30వ తేదీ వరకూ 95 సర్వీసులు నడపనున్నట్లు తెలియజేశారు. ఈ రైలు ఆది, మంగళ, బుధ, శని, మంగళ వారాలలో బెళగావిలో మధ్యాహ్నం 12-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12-50 గంటలకు మంగళూరుకు చేరుకుంటుందన్నారు.
దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 07336) ఈ నెల 17 నుంచి వచ్చే నెల మార్చి 31వ తేదీ వరకూ సోమ, బుధ, గురు, ఆది వారాలలో నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ రైలు మణుగూరులో మధ్యాహ్నం 3-40 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు బెళగావికి చేరుతుందన్నారు. ఈ రైళ్లు ఖానాపూర్, లోండా, అల్నవర్, ధార్వార్, హుబ్లీ, గదగ్, గొప్పల్, హోస్పేట, తోరణగల్లు, ధరోజీ, బళ్లారి, గుంతకల్లు, ఆదోని, కోసిగి, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, చిట్టాపూర్, మల్ఖైద్ రోడ్డు, సేరం, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, ఖాజీపేట్, వరంగల్లు, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్లు, గాంధీపురం రోడ్డు స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఇదికూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే.. ‘మూసీ దర్బార్’ పెట్టాలి
ఇదికూడా చదవండి: Gaddar: తూప్రాన్ లిఫ్టు ఇరిగేషన్‌కు గద్దర్ పేరు
ఇదికూడా చదవండి: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు
ఇదికూడా చదవండి: Uttam: డిసెంబరులో ఎన్డీఎస్‌ఏ తుది నివేదిక!?
Read Latest Telangana News and National News