Share News

AP News: దవళేశ్వరంలో బాలికల కిడ్నాప్

ABN , Publish Date - Aug 11 , 2024 | 09:56 AM

సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలో హాస్టల్లో ఉంటున్న వీరి కూతుళ్లలో ఒకరు 9, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. ఇదిలావుండగా, గత నెల 22న వెంకటేష్ అనే యువకుడు సునీతతో తాను రైల్వే టీసీ అని చెప్పి బాలికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే...

AP News: దవళేశ్వరంలో బాలికల కిడ్నాప్

రాజమండ్రి: దవళేశ్వరంలో ఇద్దరు బాలికలు కిడ్నాప్‌కు (girls kidnapped) గురయ్యారు. వెంకటేష్ అనే యువకుడు గత నెల 22వ తేదీన బాలికలను తన వెంట తీసుకెళ్లాడు. తాను రైల్వే టీసీగా పని చేస్తున్నట్లు సదరు యువకుడు బాలికల తల్లిని నమ్మించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా బరంపురానికి చెందిన సునీత కుటుంబం కొన్నేళ్లుగా దవళేశ్వరంలో నివాసం ఉంటోంది.


సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలో హాస్టల్లో ఉంటున్న వీరి కూతుళ్లలో ఒకరు 9, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. ఇదిలావుండగా, గత నెల 22న వెంకటేష్ అనే యువకుడు సునీతతో తాను రైల్వే టీసీ అని చెప్పి బాలికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే చివరకు కనిపించకుండా పోవడంతో బాలికల తల్లి దవళేశ్వరం పోలీసులను ఆశ్రయించింది. అదేవిధంగా పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి తమ కూతుళ్లను రక్షించాలని కోరింది.


ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసు విచారణలో నిందితుడు వెంకటేష్.. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురానికి చెందినవాడని తెలిసింది. ఇతడు భార్యను వదిలిపెట్టి ఓ యువతితో సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Updated Date - Aug 11 , 2024 | 09:56 AM