Share News

Union Minister CR Patil : చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం పనుల్లో వేగం

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:23 AM

చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటి ల్‌ చెప్పారు.

Union Minister CR Patil  : చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం పనుల్లో వేగం

  • త్వరలో ప్రాజెక్టును సందర్శిస్తా: జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ఏపీ సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటి ల్‌ చెప్పారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని.. 2027 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. గురువారం ఢిల్లీలో గృహప్రవేశం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులకు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలు గు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. త్వరలో పోలవరం సందర్శనకు వస్తానన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే చాలా నిధులు అందించామని, రాష్ట్రప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్మును రీయింబర్స్‌ చేస్తున్నామని తెలిపారు. కాగా, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు, భద్రతకు సంబంధించి సాంకేతిక, నిర్మాణపరమైన అంశాలపై నలుగురు అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందం కీల క సిఫారసులు చేసిందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ తెలిపారు.

Updated Date - Dec 06 , 2024 | 05:23 AM