Share News

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:07 PM

వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.

TDP: మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

రాజమహేంద్రవరం: వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు. సోమవారం ఆమె రాజమహేంద్రవరంలో పర్యటించారు. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు.

జైలు పరిసరాలను గమనించారు. ఈ సందర్భంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడాన్ని అనిత గుర్తు చేసుకున్నారు. లోపల కలియదిరిగిన ఆమె స్నేహ బ్లాక్ చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. మాజీ సీఎం జగన్ సర్కార్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించింది. ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైళ్లోని స్నేహ బ్లాక్‌లో ఉంచారు. స్నేహ బ్లాక్‌లో వసతులను చూసి అనిత చలించిపోయారు. వైసీపీ కక్ష సాధింపు రోజులు గుర్తుకువచ్చి బాధపడ్డారు.


"మా నాయకుడిని ఇక్కడే 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించారు. ఆరోజులు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తోంది. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయి. వాళ్ల పాపాలు పండాయి. జన నాయకుడిని బాధపెట్టిన వైసీపీని పాతాళంలోకి తొక్కి... ప్రజలు బలమైన తీర్పునిచ్చారు.

రాజమండ్రి సెంట్రల్ జైళ్లో వసతులను పరిశీలించా. అధికారులకు అడిగి సమస్యలను తెలుసుకున్నా. పోలీస్ సిబ్బంది తరహాలో జైలు సిబ్బందికి కూడా ఈఎల్స్ అడిగారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సెంట్రల్ జైల్లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కూడా ప్రభుత్వానికి విన్నవిస్తా. రానున్న రోజుల్లో సెంట్రల్ జైళ్లో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతాం" అని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

Vizag MLC Election: కూటమి అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ!.. ఈ నెల 13తో ముగియనున్న నామినేషన్ల గడువు

Visakha: విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. రేపే తుది గడువు..

Updated Date - Aug 12 , 2024 | 03:55 PM