Share News

AP News: ఈ గ్రామస్తులకు సలామ్ కొట్టాల్సిందే.. చేసిన పని అలాంటిది మరి..

ABN , Publish Date - Nov 15 , 2024 | 10:30 AM

Villagers Built Road for Their Village in Alluri Sitaramaraju District Andhra Pradesh Siva

AP News: ఈ గ్రామస్తులకు సలామ్ కొట్టాల్సిందే.. చేసిన పని అలాంటిది మరి..

  • ఏకమై కదిలారు.. మార్గం చూపారు..

  • రహదారి సౌకర్యం లేక దకొండా గ్రామస్థుల అవస్థలు

  • గర్భిణులు, రోగులకు తప్పని డోలీ మోతలు

  • గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం

  • గ్రామస్తుల శ్రమదానంతో మార్గం ఏర్పాటు

రహదారి సౌకర్యం లేక మండలంలోని రూఢకోట పంచాయతీలో గల మారుమూల పెదకొండా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సౌకర్యం కల్పించాలని గత ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామస్తులంతా శ్రమదానంతో 5 కిలో మీటర్ల మేర మార్గం ఏర్పాటు చేసుకున్నారు.


పెదబయలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రూఢకోట పంచాయతీ మారుమూల గ్రామమైన పెదకొండాకు సరైన రహదారి లేదు. దీంతో ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనే మోసుకెళ్లాల్సిన పరిస్థితి. తమ గ్రామానికి రహదారి నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను గ్రామస్తులు కోరారు. కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తామే రహదారిని బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గురువారం గ్రామంలోని పెద్దలు, పిల్లలు అంతా ఏకమై పారా, గునపం చేత పట్టి కనీసం ఫీడర్ అంబులెన్స్ అయినా గ్రామానికి చేరుకునే విధంగా పర్రేడా పంచాయతీ పెద్దపుట్టు గ్రామం నుంచి పెద కొండా గ్రామం వరకు 5 కిలో మీటర్ల మేర రోడ్డు బాగుచేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమకు సౌకర్యాలు కల్పించడంపై మాత్రం దృష్టి పెట్టడం లేదని వాపోయారు. గర్భిణులను, అనారోగ్యానికి గురైన వారిని డోలీలోనే ఆస్పత్రికి తరలించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


మండల కేంద్రానికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాలన్నా సరైన మార్గం లేక పాట్లు పడుతున్నామని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులంతా ఏకమై ఫీడర్ అంబులెన్స్ తమ గ్రామానికి వచ్చే విధంగా రోడ్డును బాగు చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్తులు మన్మథరావు, రాధాకృష్ణ, సింహాద్రి, తౌడుబాబు, కర్రమ్మ, చిలకమ్మ, ప్రవళిక, తదితరులు కోరుతున్నారు.


Also Read:

2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..

అధికారులపై దాడి వెనుక ఎవరున్నా ఉపేక్షించొద్దు

బిగ్ షాక్.. ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 15 , 2024 | 10:30 AM