AP: ఏపీలో వైసీపీ అరాచకం..
ABN , Publish Date - May 14 , 2024 | 03:45 AM
ఏపీలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఆ పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. వైసీపీ మూకలు ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్లు విసిరారు! పోలీసులే ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.
ఎన్డీయే అభ్యర్థులు, ఏజెంట్లపై హింసాకాండ
‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై దాడికి యత్నం
పలు చోట్ల గాలిలోకి కాల్పులు.. లాఠీచార్జి
‘ఆంధ్రజ్యోతి’ విలేకరిపై దాడికి యత్నం
పలు చోట్ల గాలిలోకి కాల్పులు...లాఠీచార్జి
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్)
ఏపీలో వైసీపీ గూండాలు పేట్రేగిపోయారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు.. ఇలా అందరిపైనా అరాచకంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా వైసీపీ మూకల హింసాకాండ యథేచ్ఛగా కొనసాగింది. ఆ పార్టీ దౌర్జన్యాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే.. వైసీపీ మూకలు ఏకంగా ఎస్పీ వాహనంపైనే రాళ్లు విసిరారు! పోలీసులే ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. వైసీపీ మూకల రాళ్లదాడులకు నిరసనగా బైకు ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులపై వారు మరోసారి దాడి చేయడంతో.. బాలింత అయిన భార్యను ఓటేయించేందుకు తీసుకెళుతున్న వ్యక్తి తలపగిలింది. ఇక.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుంలోని బూరగమంద గ్రామంలో 14 మంది టీడీపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకే కిడ్నాప్ చేశారు.
వారిని విచక్షణారహితంగా కొట్టారు. దీనిపై టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఉదయం ఆరు గంటలకు వారిని పీలేరు పింఛానది బ్రిడ్జి సమీపంలో విడిచి పారిపోయారు. అలాగే.. యాదమరి మండలం 14 కండ్రిగ ముస్లింవాడ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్న వైసీపీ నాయకుల్ని టీడీపీ శ్రేణులు వీడియో తీయడంతో సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ వర్గీయులపై కత్తులతో, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం సింగసముద్రంలో వైసీపీ అభ్యర్థి భరత్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తలుపులు మూసేశారు. వెంటనే టీడీపీ నాయకులు తలుపులు తెరిచారు. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ నేతల మీద దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఆ పార్టీ గూండాలు టీడీపీ ఏజెంట్లు, సానుభూతిపరులపై కర్రలు, కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ ఏజెంట్ చేర్రెడ్డి మంజుల, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.
దీంతో అక్కడికి చేరుకున్న మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వైసీపీ గూండాలు ఆయన కారుతో సహా మూడు కార్లను ధ్వంసం చేశారు. ఒక కారును తగలబెట్టారు. కడప జిల్లా కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేటలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుభాశ్‌రెడ్డి అనే టీడీపీ నాయకుడిని దారుణంగా కొట్టి ఊరిబయట పడేశారు. రైల్వే కోడూరు, మైదుకూరు, రాయచోటి నియోజక వర్గాల్లో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఖాజీపేట మండలం పుల్లూరులో టీడీపీ కార్యకర్త చెన్నయ్యపై వైసీపీ నాయకుడు నాగేశ్వర రెడ్డి దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి బాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. విజయవాడలో ఎన్డీయే ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిపై అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడ్డ వైసీపీ గూండాలు, ఆయన వాహనాలను వెంబడించి దాడులు చేశారు. కాకినాడ రామకృష్ణాపురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బ్రాహ్మణ కాల్వ గ్రామంలో టీడీపీ ఏజెంట్‌పై వైసీపీ వర్గీయులు దాడి చేసి కొట్టారు. ఘర్షణలో బూత్ లోపల ఫర్నీచర్