Visakhapatnam Coast : విశాఖ తీరంలో నేవీ విన్యాసాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:40 AM
విశాఖ సాగర తీరం శనివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విశాఖ సాగర తీరం శనివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. తూర్పు నౌకాదళం జనవరి 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో సాహస విన్యాసాలు ప్రదర్శించాలని నిర్ణయించింది. ఏటా డిసెంబరు 4న నేవీ డే నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఒడిశాలోని పూరీ తీరాన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమక్షంలో నిర్వహించారు. విశాఖ ప్రజల కోసం జనవరి 4న విన్యాసాల ప్రదర్శనకు నిర్ణయించారు. దానికి ముందు రిహార్సల్స్‌గా శనివారం ఆర్కే బీచ్ వద్ద వివిధ రకాల సాహస విన్యాసాలు ప్రదర్శించారు.