ABN Live..: విజన్ 2047పై ఫోకస్ పెట్టాం: సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:02 PM
విశాఖలో డీప్ టెక్ సదస్సు.. ఈ కార్య క్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామని, 2014-19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతమని.. ఇప్పుడు 15 శాతం టార్గెట్‌గా పనిచేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్ (Novatel Hotel)లో ‘డీప్ టెక్నాలజీ సదస్సు-2024’ (Deep Technology Conference 2024) ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విజన్ 2047పై ఫోకస్ పెట్టామని, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, సాంకేతికతలో అనేక నూతన మార్పులు వచ్చాయని, సాంకేతికత అంశంపై గతంలో అనేక సదస్సులు నిర్వహించామని అన్నారు. మన జీవితంలో సాంకేతికత అనేది ఒక భాగంగా మారిందని సీఎం వ్యాఖ్యానించారు.
ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామని, 2014-19 మధ్య ఏపీ గ్రోత్ రేట్ 13 శాతమని.. ఇప్పుడు 15 శాతం టార్గెట్‌గా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధార్ సాంకేతికత అనేది భారత్‌లోనే ఉందని, ఆధార్ అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తాయని, రాష్ట్రం సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నూతన సాంకేతిక ఆవిష్కరణలకు ఇతర దేశాలు పోటీపడుతున్నాయన్నారు. 1995లో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి కృషి చేశామని, పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీ నిర్మాణం చేశామన్నారు. ప్రస్తుతం డ్రోన్లు కీలకంగా మారాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత..
వైఎస్సార్‌సీపీ అక్రమాలపై నివేదిక రెడీ..
శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన..
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..
ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News