Share News

CM Chandrababu: రుషికొండ ప్యాలెస్‌ చూసిన తర్వాత చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Nov 02 , 2024 | 03:14 PM

Andhrapradesh: ‘‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తాను. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకు వచ్చారు. డ్వాక్రా సంఘాలు మా మానస పుత్రిక .. దీపం 2 కింద ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. నిన్న నేను టీ చేశాను.వంట చేయడం చాలా ఈజీ’’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

CM Chandrababu: రుషికొండ ప్యాలెస్‌ చూసిన తర్వాత చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉందంటే..
CM Chandrababu Naidu

అనకాపల్లి, నవంబర్ 2: విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. రైల్వే జోన్‌కు గత పాలకులు భూమి ఇవ్వలేదని.. తాను వచ్చిన వెంటనే భూములు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరుగులు పెట్టిస్తానన్నారు. అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకు వచ్చారన్నారు. ‘‘డ్వాక్రా సంఘాలు మా మానస పుత్రిక ..దీపం 2 కింద ఆడబిడ్డలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. నిన్న నేను టీ చేశాను.వంట చేయడం చాలా ఈజీ’’ అని చెప్పుకొచ్చారు.

Vasireddy Padma: గోరంట్ల మాధవ్‌వి అమానవీయ వ్యాఖ్యలు.. వాసిరెడ్డి పద్మ షాకింగ్ కామెంట్స్


పోలవరం ప్రాజెక్టుపై..

ఆడ బిడ్డలకు డ్రోన్ టెక్నాలజీ అందిస్తామని.. పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దుతామన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని.. దానికి రతన్ టాటా పేరు పెడతామన్నారు. ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తెలుగు జాతిని నంబర్ 1గా తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. గత పాలకులు పోలవరాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. డయా ఫ్రం వాల్‌ను పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. దుర్మార్గుడు మూడు ముక్కలాట ఆడాడని.. మూడు రాజధానులు వద్దని కూటమికి ప్రజలు ఘన విజయం ఇచ్చారన్నారు. మూడు రాజధానుల పేరుతో భూములు దోచుకున్నారని ఆరోపించారు. 450 కోట్ల ప్రజాధనంతో రిషికొండ ప్యాలెస్ కట్టారని మండిపడ్డారు.


బెల్టు షాపులు పెడితే.. బెల్టు తీస్తా

మెగా డీఎస్సీ ఇచ్చానని.. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేసి.. ప్రజల భూములను కాపాడినట్లు తెలిపారు. 175 అన్న క్యాంటీన్లు పెడితే సహించ లేకపోతున్నారన్నారు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడారని.. ఇలాంటి వారు రాష్ట్రానికి అరిష్టమంటూ వ్యాఖ్యలు చేశారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇచ్చామన్నారు. ఉచిత ఇసుక ఇస్తున్నామని.. మీ ఊర్లో ఇసుకకు వేరే వాళ్ళ పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు. మద్యం రేట్లు పెంచితే ఊరుకోనేది లేదని హెచ్చరించారు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. చెత్త పన్ను తీసేశామని.. రాష్ట్రంలో పేరుకు పోయిన చెత్త తీయాల్సి ఉందన్నారు. అత్యాచారం చేసే వారిని నడి రోడ్డు మీద ఊరి తీయాలన్నారు. మహిళలను వేధిస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మక్కెలు విరగగొట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులకు డ్రోన్ సహాయంతో ఆదుకున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు , స్థలం ఇచ్చే బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సభ ముగిసిన అనంతరం అక్కడి నుంచి విశాఖ రుషికొండ ప్యాలెస్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్లో సీఎం చేరుకున్నారు. మొదటిసారిగా రుషికొండ ప్యాలెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు.

రుషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు రియాక్షన్..

రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రుషికొండ ప్యాలెస్ సందర్శించిన ఫోటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు. వందల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు చేసి గత పాలకులు నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించానని, ప్రజాధనం అంటే బాధ్యత లేని, ప్రజలంటే లెక్కలేని ప్రజాస్వామ్యం అంటే భయంలేని పాలకులు కట్టిన నిర్మాణాలను మీడియా, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ సొమ్ముతో కోట్లు కుమ్మరించి వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఆ భవనాలను రాష్ట్రం కోసం ఎలా ఉపయోగించుకోవాలో చర్చిస్తున్నామన్నారు. అందరి సూచనలు, సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chandrababu1.jpgChandrababu2.jpgChandrababu3.jpg


ఇవి కూడా చదవండి..

Ayyanna: కోడెల విగ్రహం తొలగింపు బాధాకరం

CM Chandrababu: గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 07:14 PM