CM Jagan: విశాఖలో నేడు ముఖ్యమంత్రి జగన్ పర్యటన
ABN , Publish Date - Mar 05 , 2024 | 08:12 AM
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్..ఫ్యూచర్ విశాఖ పేరిట రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వి కన్వెన్షన్‌లో జరిగే ది కాస్కేడింగ్ సిల్క్స్ - భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మంగళవారం విశాఖ (Visakha)లో పర్యటించనున్నారు. వైజాగ్ విజన్..ఫ్యూచర్ విశాఖ పేరిట రాడిసన్ బ్లూ హోటల్ (Radisson Blu Hotel)లో నిర్వహించే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. అనంతరం వి కన్వెన్షన్‌లో జరిగే ది కాస్కేడింగ్ సిల్క్స్ - భవిత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నగరానికి రానున్నారు. ఆయన విజయవాడ నుంచి విమానంలో ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 గంటలకు రుషికొండలోని ఐటీ హిల్ నంబర్-3కు వెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్‌కు 11 గంటలకు చేరుకుంటారు. ‘వైజాగ్ విజన్-ఫ్యూచర్ విశాఖ’ పేరిట నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. 12.35 గంటలకు రాడిసన్ నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని ‘వి’ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ‘ది కాస్కేడింగ్ సిల్క్స్-భవిత’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రుషికొండ ఐటీ హిల్-3పైకి చేరుకుని హెలీకాప్టర్‌లో ఎయిర్‌పోర్టుకు వెళతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విమానంలో విజయవాడ తిరిగి వెళ్లిపోతారు.
కాగా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నం పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహిస్తుండడంతో దానిని విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. ఇటీవల కాలంలో విశాఖలో సీఎం కార్యక్రమాలను సక్సెస్ చేసే బాధ్యతను అధికారులపై పెడుతున్న సంగతి తెలిసిందే. గత నెలాఖరుల శారదా పీఠానికి వచ్చినప్పుడు విమానాశ్రయం నుంచి చినముషిడివాడ వరకు మహిళలను దారిపొడవునా ఎండలో నిల్చోబెట్టి స్వాగతం పలికించిన సంగతి తెలిసిందే.