Share News

Chandrababu: 6న విశాఖలో డీప్ టెక్నాలజీ సదస్సు.. సీఎం హాజరు..

ABN , Publish Date - Dec 04 , 2024 | 09:51 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆరో తేదీన నోవాటెల్‌లో జరిగే ‘డీప్‌ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. దీనిని గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

Chandrababu: 6న విశాఖలో డీప్ టెక్నాలజీ సదస్సు.. సీఎం హాజరు..

విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గురువారం విశాఖ (Visakha) పర్యటనకు వెళ్లనున్నారు. 6వ తేదీ (శుక్రవారం) విశాఖ నోవాటెల్ హోటల్‌ (Novatel Hotel)లో జరిగనున్న డీప్ టెక్నాలజీ సదస్సు (Deep Technology Conference) 2024కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు వీఎంఆర్డీఏలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళతారు.

కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఆరో తేదీన నోవాటెల్‌లో జరిగే ‘డీప్‌ టెక్నాలజీ సదస్సు-2024’లో పాల్గొంటారు. దీనిని గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ నిర్వహిస్తోంది. దీనికి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఠక్కర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన అనంతరం చంద్రబాబునాయుడు సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయానికి కూడా వెళతారు.


వీఎంఆర్‌డీఏలో ఏర్పాట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి వస్తున్నందున ఆ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను కమిషనర్‌ విశ్వనాథన్‌ ఆదేశించారు. ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ప్రాంగణం అంతా తిరిగి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌, సీఈ భవానీశంకర్‌, ఎస్‌ఈ బలరామరాజు, డీఎఫ్‌ఓ శివానీ తదితరులు పాల్గొన్నారు.

కాగా విశాఖ డెయిరీపై వచ్చిన అభియోగాలపై అసెంబ్లీ స్పీకర్‌ నియమించిన సభా సంఘం తొలి సమావేశం మంగళవారం అమరావతి అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభాసంఘ సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, బేబి నాయన, దాట్ల సుబ్బరాజు, బొండా ఉమ, గౌతు శిరీష పాల్గొన్నారు. డెయిరీలో అక్రమాలలపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. విచారణ ఎలా ప్రారంభించాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించారు. డెయిరీని సందర్శించిన తర్వాత సభాసంఘం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. భేటీ అనంతరం జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ‘పాడి రైతులకు ఉపయోగం లేకుండా, యాజమాన్యానికి లబ్ధి చేకూరేలా విశాఖ డెయిరీ వ్యవహారం ఉందని అభియోగాలు వచ్చాయి. అందువల్ల ఈనెల 9న విశాఖ డెయిరీని సభా సంఘం పరిశీలించనున్నది. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. డెయిరీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వ్యవహారాలు చూసే వారూ సమావేశానికి రావాలని చెప్పాం.

స్పీకర్‌ అనుమతితో ఆడిటర్‌ను, సహకార, కంపెనీస్‌ చట్టాలపై అవగాహన ఉన్న నిపుణులను ఈ బృందంలో చేర్చుకుంటాం. పాడి రైతులకు నష్టం జరగకుండా సభాసంఘం సిఫారసులు ఉంటాయి’ అని చెప్పారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ‘గతంలో లాభాల్లో నడిచిన విశాఖ డెయిరీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లింది. ఆ నష్టాన్ని పాడి రైతుల మీద వేయడం సబబు కాదు. ప్రభుత్వ అజయాయిషీ లేకపోవడంతో, ఒక వ్యక్తి లబ్ధి కోసం అవకతవకలు జరిగాయని అభియోగాలున్నాయి. విశాఖ డెయిరీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నష్ట నివారణ చర్యలకు సిఫారసు చేస్తాం. నిధుల మళ్లింపుపైనా సమగ్ర నివేదిక సభ ముందు ఉంచుతాం’ అని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ బంధువుల్లో నోటీసుల కలకలం..

రాజధాని నివాసిగా ఏపీ సీఎం చంద్రబాబు

కోహ్లీకి గాయం.. రెండో టెస్ట్‌కు డౌట్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో టీం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 04 , 2024 | 10:59 AM