Share News

AP Rains: ఉత్తరాంధ్రలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన

ABN , Publish Date - Dec 21 , 2024 | 02:30 PM

Andhrapradesh: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతోందని తెలిపారు. రాగల 24 గంటల్లో వాయుగుండం బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఉత్తరకోస్తా జిల్లాల్లో చెదురు మధురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

AP Rains: ఉత్తరాంధ్రలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన
AP Rains

విశాఖపట్నం, డిసెంబర్ 21: గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. చేతికి వచ్చిన పంట ఇలా నీటిపాలు అవడంతో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడం ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మూడు రోజులు ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బలమైన గాలులు వీచాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

మోదీకి కలిసొచ్చిన ఈ ఏడాది..


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని.. వాయుగుండం ఈశాన్య దిశగా కదులుతోందని తెలిపారు. రాగల 24 గంటల్లో వాయుగుండం బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఉత్తరకోస్తా జిల్లాల్లో చెదురు మధురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే తీరం వెంబడి 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో అల్లకల్లోలం కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే పోర్టులకు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కాగా.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విజయనగరం జిల్లా బొండపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. బీమిలి సహా పలు ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అలాగే విశాఖలో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

నిద్రపట్టడం లేదు.. అశ్విన్ వైఫ్ ఎమోషనల్


ముఖ్యమంత్రి సమీక్ష

మరోవైపు ఉత్తరాంధ్రలో వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) సమీక్ష నిర్వహించారు. సీఎంవో అధికారులు ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరించారు. కలెక్టర్లు, జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు.. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు సీఎంకు అధికారులు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. వర్షాల అనంతరం పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల సమాచారాన్ని ఎప్పటికిప్పుడు రైతులకు చేరేలా చూడాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

నిధుల మంజూరు, ఇతర పనులపై ఆరోపణలు

ఇదేం విన్యాసంరా బాబోయ్..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 04:16 PM