Anakapalli Police: రూ.50వేల రివార్డు ప్రకటించిన అనకాపల్లి పోలీసులు.. ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:33 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం (Koppugondupalem) బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్(Suresh) కోసం అనకాపల్లి(Anakapalli) జిల్లా పోలీసులు(Police) గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడు ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. సురేశ్ పరారైన సమయంలో బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, ట్రాక్ పాయింట్ ధరించి ఉన్నాడు.
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం(Koppugondupalem) బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్(Suresh) కోసం అనకాపల్లి(Anakapalli) జిల్లా పోలీసులు(Police) గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడు ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. సురేశ్ పరారైన సమయంలో బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, ట్రాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతిని జిల్లా పోలీసులు ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9440796084, 9440796108, 9440904229, 7382625531 లేదా 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. నిందితుని గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఓ ప్రకటన వెల్లడించారు.
కొప్పుగొండుపాలెంలో జులై 6వ తేదీ సాయంత్రం బాలిక ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి పోలీసుల కళ్లుగప్పి సురేశ్ పరారీలో ఉన్నాడు. బాలిక మృతిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 20కి పైగా ప్రత్యేక బృందాలతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు సహా రద్దీగా ఉండే ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. అయినా ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు. సురేశ్ ఫోన్ వాడకపోవడంతో పోలీసులకు కేసు సవాల్‌గా మారింది. సురేశ్ స్నేహితులు సహా కాల్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, వైజాగ్ జైలులో ఉన్న పరిచయాలపైనా ఆరా తీస్తున్నారు. త్వరలోనే నిందితుడు తమకు చిక్కుతాడని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.