Rajnath Singh: ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది
ABN , Publish Date - Feb 27 , 2024 | 02:58 PM
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని.. భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. మంగళవారం నాడు ‘భారత్ రైజింగ్ అలైట్ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని.. భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. మంగళవారం నాడు ‘భారత్ రైజింగ్ అలైట్ మీట్’ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పూర్తిస్థాయిలో నెరవేర్చారని చెప్పారు. 370 యాక్ట్, ట్రిపుల్ తలాక్‌లను రద్దు చేయగలిగామని అన్నారు. ఉమ్మడి పౌరసత్వాన్ని త్వరలో తీసుకువస్తామని తెలిపారు. భారత్ బలహీనమైన దేశం కాదని.. ఒక బలమైన దేశమని చెప్పారు.
2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని అన్నారు. 2047 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదుగుతామని వివరించారు. బీజేపీ మతతత్వం పార్టీ కాదని లౌకిక పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ అస్థిత్వానికి, అవినీతికి అమ్మ లాంటిదని ఆరోపించారు. డిజిటల్ ఎకానమీలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో బీజేపీకు ఓటు బ్యాంకు ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...