Share News

Crime: విశాఖలో అధికారులకు రక్షణ కరువైంది: రాజేంద్రప్రసాద్

ABN , Publish Date - Feb 03 , 2024 | 08:40 AM

విశాఖ: నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...

Crime: విశాఖలో అధికారులకు రక్షణ కరువైంది:  రాజేంద్రప్రసాద్

విశాఖ: నగరంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమణయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం విశాఖలో అధికారులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతానికి కూత వేటు దూరంలోనే హత్య జరగడం దారుణమన్నారు. పని ఒత్తిడి ఎక్కువ ఉందని... ఇక్కడ పని చేయలేకపోతున్నానని తనతో ఇటీవలే చెప్పారన్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా, బొండపల్లికి బదిలీ అయిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న తన సోదరుడు లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 28 సంవత్సరాల సర్వీస్ ఉన్న... తన సోదరుడు కేవలం 8 సంవత్సరాల సర్వీస్ చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులపై తనకు నమ్మకం ఉందని.. న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని రాజేంద్రప్రసాద్ అన్నారు.

కాగా విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను దారుణంగా హత్య చేశారు. కొమ్మది చరణ్ క్యాస్టల్‌లో ఈ ఘటన సంచలనం రేపింది. కొమ్మాదిలో తన ఇంట్లో ఉన్న రమణయ్యపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రాడ్‌లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. సీపీ రవిశంకర్ ఆయన్నర్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మండల మేజిస్ట్రేట్‌కే భద్రత కరువైంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.

Updated Date - Feb 03 , 2024 | 08:40 AM