Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Andhra Pradesh: అందాల ఇన్‌స్టాగ్రమ్ దొంగ.. 100 తులాల బంగారం కొట్టేసింది.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:50 PM

Visakhapatnam News: చూసేందుకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకేముంది.. సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా(Social Media Influencer) మంచి గుర్తింపు పొందింది. మరి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఏం సంపాదిస్తాం లే అనుకుందో.. లేక వచ్చే డబ్బులు సరిపోలేదో తెలియదు గానీ..

Andhra Pradesh: అందాల ఇన్‌స్టాగ్రమ్ దొంగ.. 100 తులాల బంగారం కొట్టేసింది.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Visakhapatnam Robbery Case

విశాఖపట్నం, మార్చి 03: చూసేందుకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇంకేముంది.. సోషల్ మీడియా బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా(Social Media Influencer) మంచి గుర్తింపు పొందింది. మరి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఏం సంపాదిస్తాం లే అనుకుందో.. లేక వచ్చే డబ్బులు సరిపోలేదో తెలియదు గానీ.. పార్ట్‌టైమ్ జాబ్‌ చేయడం ప్రారంభించింది. పార్ట్ టైమ్ జాబ్ అంటే ఏదో కష్టపడి పని చేస్తుందనుకునేరు.. చోరీలు చేయడం స్టార్ట్ చేసింది. అవును.. ప్రభుత్వ రిటైర్డ్ ఇంటికి కన్నం వేసింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసే అమ్మాయి.. ఏకంగా అతని ఇంట్లోంచి 100 తులాల బంగారం చోరీ చేసింది. ఈ కేసును చేధించిన విశాఖ పోలీసులు(Vizag Police).. మ్యాటర్ మొత్తాన్ని వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని దొండపర్తి రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయ్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే సౌమ్య.. 100 తులాల బంగారం చోరీ చేసినట్లు గుర్తించారు. దొంగిలించిన బంగారంతో సౌమ్య గోవాకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది. మొత్తం 4 విడతలుగా దొంగతం చేసిన సౌమ్య.. ఆ నగలను అమ్మి డబ్బులు తీసుకుంది. అనంతరం గోవా ట్రిప్‌కి వెళ్లి రీల్స్ చేసుకుంది సౌమ్య. మొత్తానికి అందాల ఇన్‌స్టాగ్రమ్‌ దొంగే ఈ చోరీ చేసినట్లు గుర్తించిన విశాఖ క్రైమ్ పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2024 | 12:50 PM