Share News

Visakha: ఈవ్ టీజర్స్‌పై మహిళ పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Jul 07 , 2024 | 08:37 AM

విశాఖపట్నం: ఈవ్ టీజర్స్‌పై మహిళ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బస్సు స్టాప్‌ల్లో అల్లరిమూకల ఆట కట్టిస్తున్నారు. మహిళలకు రక్షణ కవచంగా పోలీసులు మారారు. కాలేజ్, బస్సు స్టాప్, రద్దీ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మహిళల బద్రత కోసం మఫ్టీలో మహిళ పోలీసులు నిఘా పెట్టారు.

Visakha: ఈవ్ టీజర్స్‌పై మహిళ పోలీసుల ఉక్కుపాదం

విశాఖ: ఈవ్ టీజర్స్‌ (Eve Teasers)పై మహిళా పోలీసులు (Women Police) ఉక్కుపాదం మోపుతున్నారు. బస్సు స్టాప్‌ల్లో అల్లరిమూకల ఆట కట్టిస్తున్నారు. మహిళలకు రక్షణ కవచంగా పోలీసులు మారారు. కాలేజ్, బస్సు స్టాప్, రద్దీ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మహిళల బద్రత కోసం మఫ్టీలో మహిళ పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పలువురుని అదుపులోకి తీసుకున్నారు. హద్దు మీరే యువతకు అరదండలు వేస్తున్నారు. మహిళలపై ర్యాగింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని మహిళా పోలీసులు హెచ్చరిస్తున్నారు.


కాగా.. టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత హోంమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళల భత్రత కోసం చర్యలు చేపట్టారు. ‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్‌ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్‌ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం గంజాయి రాజధానిగా మారిందని హోంమంత్రి అన్నారు.


పాఠశాల విద్యార్థుల పుస్తకాల సంచిలో గంజాయి ప్యాకెట్లు లభించడం తల్లితండ్రులను కలవరానికి గురి చేసిందని, రాష్ట్రమంతా విస్తరిస్తోన్న ఈ మహమ్మారిని ప్రజల సహకారంతో పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి మొక్కను పునాదుల నుంచి పీకేస్తామని, గిరిజనుల్ని ప్రలోభ పెడుతోన్న బడా వ్యాపారులకు ఉచ్చు బిగిస్తామన్నారు. మత్తు బారిన పడుతోన్న బాలలు, యువతకు ఉపశమనం కల్పిస్తామని, గంజాయి సాగు, సరపరా కట్టడికి యాంటీ నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏటీఎన్‌ఎస్‌) ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీ గోడ ఖర్చు 10 కోట్లు..!

Jagan : చంద్రబాబూ.. హెచ్చరిస్తున్నా!

RK Kothapaluku : నవ్విపోదురుగాక..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 07 , 2024 | 09:24 AM