Share News

Vizianagaram: వైభవంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు..

ABN , Publish Date - Oct 15 , 2024 | 10:07 AM

విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమాను సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం 3 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడుస్తాయి.

Vizianagaram:  వైభవంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు..

విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు (Piditalli Ammavari Sirimanu celebrations) వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు(Devotees) భారీగా బారులు తీరారు. మంగళవారం సాయంత్రం మూడు గంటలకు సినిమాను రథోత్సవాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2వేల మంది పోలీసులతో విస్తృతమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఉచిత దర్శనాలు (Free Sightings) ఏర్పాటు చేసింది.


కాగా విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమాను సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం 3 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడుస్తాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి సిరిమానోత్సవాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు.


భక్తిశ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం

పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో జరిగింది. పూసపాటి వంశీయులు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులు కూడా పైడిమాంబకు పట్టువస్త్రాలు సమర్పించి, పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 10.35 గంటల సమయంలో అమ్మవారిని తొలేళ్ల ఉత్సవానికి సిద్ధం చేస్తూ వివిధ నదీజలాలతో అభిషేకించారు.

రైతులకు విత్తనాలు పంపిణీ

సిరిమాను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం విజయనగరం పరిసర ప్రాంత రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలను తీసుకునేందుకు రైతులు అర్ధరాత్రి వరకూ వేచి ఉన్నారు. రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ తంతుతో తొలేళ్ల ఘట్టం పూర్తయింది.

కాగా పైడితల్లి సిరిమానోత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా, భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నిర్వహించాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. సిరిమానోత్సవాన్ని మంగళవారం సాయంత్రం 3 గంటలకు కచ్ఛితంగా ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అటవీ శాఖ అధికారులు, ఆర్డీవోలు దగ్గర ఉండి పర్యవేక్షించాలన్నారు. తొక్కిసలాట జరగకుండా చూడాలన్నారు. వీఐపీలు వచ్చే సమయంలో సాధారణ భక్తుల క్యూలైన్లను నిలుపుదల చేయవద్దన్నారు. అందరికీ త్వరగా దర్శనం అయ్యేలా చూడాలని తెలిపారు. అమ్మవారి ప్రసాదాలు అందరికీ సరిపడేలా తయారు చేయాలని, వీటిని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్‌గామారనున్న అల్పపీడనం..

ఏపీలో కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు..

ఏపీలో లిక్కర్ సిండికేట్ బరితెగింపు..

రేపటికల్లా తుఫాన్‌..

లోన్‌ ఇప్పించి మరీ రూ.20 లక్షల సైబర్‌ దోపిడీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 15 , 2024 | 10:07 AM