Share News

Trains Cancellation: 45 రోజులపాటు.. 26 రైళ్ళ రద్దు..

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:30 AM

రాజమండ్రి: రైల్వే అధికారులు సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి, సర్కార్ ఎక్స్‌ప్రెస్ సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి.

Trains Cancellation: 45 రోజులపాటు.. 26 రైళ్ళ  రద్దు..

రాజమండ్రి: రైల్వే అధికారులు (Railway Officers) సోమవారం నుంచి 45 రోజులపాటు 26 రైళ్లను (26 Trains) రద్దు (Cancellation) చేశారు. రద్దు చేసిన వాటిలో రత్నాచల్(Ratnachal), జన్మభూమి (Janmabhumi), సింహాద్రి (Simhadri), సర్కార్ ఎక్స్‌ప్రెస్ (Sarkar Express) సహా డిమాండ్ ఉన్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో విజయవాడ (Vijayawada), విశాఖ (Visakha), తిరుపతి (Tirupati), హైదరాబాద్ (Hyderabad) వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. ఆకస్మికంగా రైళ్ల రద్దు చేయడంపై రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు మండిపడుతున్నారు. ఒక్క రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజూ 30 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ప్రత్యామ్నాయంగా ఇంటర్ సిటీ రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రైళ్ల రద్దు సమస్యపై స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాగా కడియం - నిడదవోలు (Kadiam - Nidadavolu) మధ్య రైల్వే ట్రాక్ (Railway track) ఆధునికరణ కోసం ఆగస్టు 10వ తేదీ వరకు నెలన్నర పాటు రైళ్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..

రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం

జగన్ జైలుకు వెళ్తే.. మా పరిస్థితి ఏంటి..?

ఒక్కొక్కటిగా బయటకు వైసీపీ ఆక్రమణలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 24 , 2024 | 11:32 AM