Share News

AP News: అధికారులకు చుక్కలు చూపుతున్న చిరుత

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:39 AM

Andhrapradesh: ఏపీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమలలో గత నాలుగు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

AP News: అధికారులకు చుక్కలు చూపుతున్న చిరుత
Leopard migration in Eluru

ఏలూరు, అక్టోబర్ 24: చిరుత పులి (Leopard )అంటే భయపడని వారు ఉండరు. ఈ మధ్య తరుచూ గ్రామాల్లోకి వచ్చి హల్‌చల్ చేస్తున్నాయి చిరుతలు. ఎప్పుడు, ఎక్కడి నుంచి చిరుత వచ్చి దాడి చేస్తుందో అనే భయాందోళనలో గడపాల్సిన పరిస్థితులు గ్రామ ప్రజల్లో నెలకొంది. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాలన్నా జనాలు వణికిపోతున్నారు. ఇక పశువుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఏ రోజు ఏ పశువుపై చిరుత దాడి చేస్తుందో తెలీది. తాజాగా ఏలూరు జిల్లాలోని (Eluru District) ద్వారకా తిరుమలలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక చిరుత పట్టుకునేందుకు అటవీ అధికారులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ అధికారులకు దొరకకుండా చిరుత చుక్కలుచూపిస్తోంది.

Pongulati: ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్‌ బాంబులు పేలతాయి!



ట్రాప్ కెమెరాలో చిరుత దృశ్యాలు

జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి శివారులో చిరుత పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నాలుగు బోన్లు, లైవ్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రుల్లు పులి పర్యవేక్షణ కోసం తాజాగా మచాన్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. చిరుతను పట్టకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. గత నాలుగు రోజులుగా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచిరిస్తోంది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి.


ఆ చిరుత ఈ చిరుత ఒక్కటే..

అయితే గత నెల రాజమండ్రి సమీపంలో సంచరించిన చిరుత ద్వారకా తిరుమలలో సంచరిస్తున్న చిరుత ఒక్కటేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిరుతను బంధించేందుకు ఇప్పటికే రెండు బోన్లు ఏర్పాటు చేయగా.. అదనంగా మరో రెండు బోన్లను కూడా సిద్ధం చేశారు. చిరుత కదలికలను గుర్తించడం కోసం 15 ట్రాప్ కెమెరాలను అధికారులు అమర్చారు. రెండు లైవ్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పొలాలకు వెళ్లే రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

AP Political War: దీపావళికి ముందే ఏపీలో పొలిటికల్ టపాసులు పేలతాయా.. తుస్సుమంటాయా..



ఏనుగుల బీభత్సం

elephants.jpg

మరోవైపు చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం అంతా ఇంతా కాదు. తరుచుగా ఏనుగులు జిల్లాలో సంచరిస్తూ పంటపొలాల్లో తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. రామకుప్పం మండలం పీఎంకే తాండలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. పొలం వద్ద పంటకు కాపలాగా ఉన్న రైతు రెడ్డినాయక్‌పై ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్ర గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామనికి చెందిన ఓ రైతును మూడు నెలల ముందు ఏనుగు తొక్కి చంపేసింది. తరచూ ఒంటరి ఏనుగు గ్రామ సమీపంలోకి వస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు.


ఇవి కూడా చదవండి..

South India States: దక్షిణాదిన జన ఆందోళన!

YS Jagan: నాన్నకు మాటిచ్చి తప్పావ్‌..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 09:55 AM