Share News

Minister Nimmala: పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

ABN , Publish Date - Dec 11 , 2024 | 10:26 AM

రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతుల‌కు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిల‌ను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.

Minister Nimmala: పేదలకు చెక్కులను అందజేసిన మంత్రి నిమ్మల

ప.గో. జిల్లా: పాలకొల్లు (Palakollu) నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CM Relief Fund)నుంచి రూ. 8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నాడు జగన్ (Jagan) ప్రభుత్వం ఐదేళ్లలో కక్షలు , వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యం దూరం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతుల‌కు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిల‌ను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతులను అబద్దాలతో దగా, మోసం చేసిన జగన్, వైఎస్సార్‌సీపీ నాయకులకు రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తొలిసారి కౌలు రైతుల‌కు ఈ క్రాప్ న‌మోదు సౌక‌ర్యం కల్పించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో డిసెంబర్ 15వ తేదీన సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవటానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

ఆడపిల్లలకు మేనమామనంటూ రాష్ట్రంలో వేలాదిమంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి , చెళ్లళ్లకే న్యాయం చేయలేదని మండిపడ్డారు. వారిపై పేటీఎం కూలీలతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో లేనిపోని నిందలు మోపిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ పాపాలపై ఫిర్యాదుల వెల్లువ

అమరావతిపై 45 శాతం అదనపు భారం

శిక్షణ తరగతులను బహిష్కరించిన బీఆర్ఎస్

ములుగు జిల్లాలో పెద్దపులి సంచారం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 11 , 2024 | 10:26 AM