Nimmala Ramanaidu: పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం
ABN , Publish Date - Dec 15 , 2024 | 07:41 AM
జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆదివారం ఉదయం పాలకొల్లు (Palakollu)లో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం (Save the Girl Child programme) ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా 2కే రన్ (2K run) నిర్వహించారు. ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత హాజరవుతున్నారు.
కాగా జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో డిసెంబర్ 15వ తేదీన సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవటానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.
ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేలాదిమంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఇంటికి పెద్దన్న అవుతానంటూనే సొంత తల్లి , చెళ్లళ్లకే న్యాయం చేయలేదని మండిపడ్డారు. వారిపై పేటీఎం కూలీలతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో లేనిపోని నిందలు మోపిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన
ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News