Share News

AP News: ఆస్తికోసం.. వదినను బెదిరించడానికి బిగ్ స్కెచ్.. డెడ్ బాడీ పార్సిల్ కేసులో దిమ్మతిరిగే నిజాలు

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:37 PM

Andhrapradesh: పశ్చిమగోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్‌ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

AP News: ఆస్తికోసం.. వదినను బెదిరించడానికి బిగ్ స్కెచ్.. డెడ్ బాడీ పార్సిల్ కేసులో దిమ్మతిరిగే నిజాలు
Dead body parcel case

పశ్చిమగోదావరి, డిసెంబర్ 25: ఏపీలో డెబ్‌బాడీ పార్శిల్ కేసు అనేక మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. మొదట్లో సాగి తులిసి అనే మహిళ ఇంటికి డెడ్‌బాడీ పార్శిల్‌ రావడం తీవ్ర కలకలం రేపగా.. అసలు ఈ డెడ్‌ బాడీ ఎవరిది?.. ఎవరు హత్య చేశారు? అనేదానిపై పోలీసులు లోతైన విచారణ జరిపారు. చివరకు డెడ్‌ బాడీ ఎవరిదో గుర్తించారు. అలాగే నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డెడ్ బాడీ గురించి పోలీసులు చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పనికోసం వచ్చిన వాడిని హతమార్చడాన్ని ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో సాగి తలసి అనే మహిళ ఇంటికి పార్శిల్ వచ్చింది. దాన్ని తెరిచి చూడా అందులో ఉన్నదాన్ని చూసి సదరు మహిళ షాక్‌‌కు గురైంది. పార్శిల్‌గా డెడ్‌బాడీ రావడంతో మహిళ పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు.


అలాగే మృతదేహాన్ని గుర్తించడంలోనూ పోలీసులు పురోగతి సాధించారు. పార్శిల్‌గా వచ్చిన డెడ్‌బాడీ కాళ్ల గ్రామానికి చెందిన పర్లయ్యదిగా గుర్తించారు. అలాగే పర్లయ్యను హత్య చేసింది తులసి సోదరి భర్త శ్రీధర్‌ వర్మగా నిర్ధారించారు. ఈ క్రమంలో శ్రీధర వర్మ కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు చివరకు అతడిని పట్టుకుని రహస్యంగా విచారణ చేపట్టారు. అయితే నిందుతుడు శ్రీధర్ వర్మ గురించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. శ్రీధర్‌ వర్మకు మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య అక్క సాగి తులసితో ఆస్థి వ్యవహారానికి సంబంధించి గొడవు నడుస్తున్నాయని.. ఈ క్రమంలో ఆమెను బెదరించడానికి పక్కా స్కెచ్‌తో పర్లయ్యను హత్య చేసి పార్శిల్‌గా పంపించినట్లు బయటపడింది.

Manchu Vishnu: టాలీవుడ్‌లో వివాదాస్పద పరిణామాలపై విష్ణు కీలక వ్యాఖ్యలు


భారీ స్కెచ్..

అయితే హత్య విషయంలోనూ నిందుతుడు ముందగానే పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. ఇందులో భాగంగా రెండు శవపేటికలను తయారు చేయించాడు. అలాగే రోజు వారీ కూలీలైన పర్లయ్య, రాజులను పని ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. ముందుగా అనుకున్న ప్రకారం వారిలో ఒకరిని చంపి పార్శిల్‌ చేయాలని భావించాడు. అయితే రాజుకు కుటుంబసభ్యులు ఉన్నందును అతడిని చంపితే గొడవలు అవుతాయని భావించిన శ్రీధర్ వర్మ.. పర్లయ్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. పర్లయ్యకు కుటుంబసభ్యుల ఉన్నా వారు పట్టించుకోరని భావించిన శ్రీధర్.. అనుకున్న ప్రకారం పర్లయ్యను హతమార్చాడు. ఇదంతా మూడో భార్య ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. మూడో భార్య ఇంట్లో పర్లయ్యను హత్య చేసి ఆపై తాను ముందు సిద్ధం చేసిపెట్టుకున్న శవపేటికలో మృతదేహాన్ని ఉంచాడు. స్వయంగా శ్రీధర్ వర్మనే కారులో పార్శిల్‌ను తీసుకెళ్లి తులసి ఇంట్లో పెట్టి.. ఓపెన్ చేసి పరారైనట్లు స్థానికులు చెబుతున్న మాట. అయితే ఈ మొత్తం వ్యహారంలో శ్రీధర్ వర్మ మూడో భార్య ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


పర్లయ్య మృతిపై

మరోవైపు పర్లయ్య మృతిపై కాళ్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదరహితుడిగా ఉన్న పర్లయ్యను ఇంత దారుణంగా హత్య చేయడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే మూడో భార్య ఇంట్లో మరో శవపేటికను కూడా పోలీసులు గుర్తించారు. అసలు ఇంకో శవపేటికను శ్రీధర్ వర్మ ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే నిందితుడి ఇంట్లో పోలీసులు సెర్చ్ చేయగా చేతబడి చేసే సామాగ్రి కూడా లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు శ్రీధర్ వర్మ వృత్తి ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


మరో శవపేటిక ఎందుకు?..

ముఖ్యంగా తులసిని ఆస్తి కోసమే బెదిరించడానికి ఎలాంటి సంబంధం లేని పర్లయ్యను ఎందుకు హత్య చేశాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్‌ మరొకరు ఉన్నారా? కేవలం తులసిని బెదిరించడానికే ఇంత స్కెచ్ వేశాడా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు శ్రీధర్ వర్మ సహకరించడం లేదని.. పోలీసులు వేస్తున్న ప్రశ్నలకు శ్రీధర్ వర్మ సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలుస్తోంది. మొత్తానికి డెడ్‌ బాడీ పార్శిల్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

Allu Arjun: తప్పయిపోయింది!

ACB Files : సంజయ్‌పై ఏసీబీ కేసు

Read latest AP News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 12:37 PM