MLC Ashok Babu: పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారు?
ABN , Publish Date - May 31 , 2024 | 01:09 PM
పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్‌పై వేసిన అప్పీల్‌లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా.. నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతోందన్నారు.
అమరావతి: పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్‌పై వేసిన అప్పీల్‌లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా.. నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతోందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యధాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. హైకోర్టులో వారి వాదనలను వైసీపీ వెనక్కి తీసుకుందని అశోక్ బాబు తెలిపారు.
ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..
‘‘పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీ ఏవో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధం. సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. వైసీపీవారు ఉక్రోషంతో ఇటువంటి లిటికేషన్స్ తయారు చేస్తున్నారు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.4 వ తేది తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయం’’ అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పొన్నవోలు వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటారో..
కౌంటింగ్‌కు ముందే.. వైసీపీలో ఓటమి భయం..
Read Latest AP News and Telugu News