Share News

YCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:33 PM

Andhrapradesh: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు శాసనసభ అధికారులు మరోసారి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు వైసీపీ చీఫ్ విప్ ప్రసాదరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

YCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ

అమరావతి, జనవరి 31: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు (YCP Rebel MLAs) శాసనసభ అధికారులు మరోసారి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు వైసీపీ చీఫ్ విప్ ప్రసాదరాజు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ లోపు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొన్న జరిగిన విచారణలో కొంతమంది సభ్యులు పంపిన సీడీలు, పెన్ డ్రైవ్‌లు ఓపెన్ కావడం లేదని ఎమ్మెల్యేలు చెప్పారని అధికారులు పేర్కొన్నారు. మళ్లీ ఎమ్మెల్యేల పరిశీలన కోసం పెన్ డ్రైవ్ లు, సీడీలు పంపుతున్నామని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. వీటిని తెరవడంలో ఎటువంటి సాయం అవసరమైనా శాసనసభ కార్యదర్శి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆదేశించారు. విచారణకు రావాలని నలుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.

కాగా.. ముందుగా ఇచ్చిన నోటీసుల ప్రకారం ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు సోమవారం(జనవరి 29) స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజా నోటీసులతో ఫిబ్రవరి 8న ఎమ్మెల్యేలను ఒకేసారి స్పీకర్ విచారించనున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 04:41 PM