Share News

YS Jagan: నా మతం మానవత్వం.. వైఎస్ జగన్ సంచలనం

ABN , Publish Date - Sep 27 , 2024 | 05:28 PM

నా మతం మానవత్వం అని.. డిక్లరేషన్‌లో ఏం రాసుకుంటారో రాసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమిలోని బీజేపీ చూస్తూ ఏందుకు ఊరుకుంటుందని ప్రశ్నించారు.

YS Jagan: నా మతం మానవత్వం.. వైఎస్ జగన్ సంచలనం
YS Jagan

తాడేపల్లి: వైసీపీ అధినేత జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శంచుకుందామంటే మతం పేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘నా మతం మానవత్వం. ఇదే విషయం డిక్లరేషన్‌లో రాసుకొండి. డిక్లరేషన్ పేరుతో దిగజారుడు రాజకీయాలు కొనసాగుతున్నాయి. నేను ఇంట్లో బైబిల్ చదువుతా. ఆలయానికి వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తా. ముస్లిం, సిక్కు, ఇతర మతాలను గౌరవిస్తా అని’ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తిరుమల పర్యటన రద్దయిన తర్వాత తాడేపల్లిలో జగన్ మీడియాతో మాట్లాడారు.


శ్రీవారి సేవలో నా తండ్రి, నేను

‘నా తండ్రి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఐదేళ్లు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేను ఆయన కుమారుడినే కదా. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించా. రాష్ట్రంలో మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిగా తిరుమల వెళ్లకూడదా. నేను మొదటిసారి తిరుమల వెళ్లడం లేదు.. ఇప్పటికే 15 సార్లు తిరుమల వెళ్లా. రాష్ట్రంలో ఓ మాజీ ముఖ్యమంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగతా వారి పరిస్థితి ఏంటీ. ముఖ్యంగా దళితుల పరిస్థితి ఏంటీ అని’ వైఎస్ జగన్ ప్రశ్నించారు.


jagan.jpg


బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది

‘ఏడుకొండల వాడి ఆశీస్సులతోనే పాదయాత్ర ప్రారంభించా. యాత్ర ముగిసిన తర్వాత కాలినడకన కొండ ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నా. అప్పటి సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియదా. సీఎం హోదాలో ఐదుసార్లు పట్టువస్త్రాలు సమర్పించా. 11 సార్లు తిరుమల వెళ్లా. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో అడ్డుకుంటామని నోటీసులు ఇస్తారా. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ విశిష్టతను కించపరుస్తోంది. ఈ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదు. మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు. రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని పావుగా వాడుతున్నారు అని’ వైస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Viral News: హమ్ దో హమారే దో డజన్‌పై క్లారిటీ

ED Raids: పొంగులేటి నివాసాల్లో ఈడీ అధికారుల సోదాలు

KTR: హైడ్రా టార్గెట్‌గా కేటీఆర్ ఘాటు విమర్శలు


మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 27 , 2024 | 06:51 PM