Share News

YS Sharmila: కాంగ్రెస్‌లో చేరిక తర్వాత తొలిసారి ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వైఎస్ షర్మిల.. ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 04 , 2024 | 04:10 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు (గురువారం) కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ఆమె హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో ‘ఎక్స్’ వేదికగా ఆమె తొలిసారి స్పందించారు.

YS Sharmila: కాంగ్రెస్‌లో చేరిక తర్వాత తొలిసారి ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వైఎస్ షర్మిల.. ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేడు (గురువారం) కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ఆమె హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ‘ఎక్స్’ వేదికగా ఆమె తొలిసారి స్పందించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తనకు చాలా సంతోషంగా ఉన్నారు. ‘‘ కాంగ్రెస్ నా తండ్రి పని చేసిన పార్టీ. ఆయన మనుగడ సాగించిన పార్టీ. ఆయన నిరంతరాయం సేవ చేసిన పార్టీ. ఆయన తుదిశ్వాస విడిచిన పార్టీ. ఈ క్షణం ఆయనను ఉప్పొంగేలా చేస్తుంది. సొంతింటికి రావడం కంటే ఇంకేది ఎక్కువ కాదు’’ అని భావోద్వేగంగా స్పందించారు.


రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నది తన తండ్రి కల అని, దీన్ని సాధించేందుకు తాను కష్టపడి పనిచేస్తానని షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, భారత నిజమైన సంస్కృతిని నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. భారతదేశాన్ని పునాది నుంచి నిర్మించి అన్ని వర్గాలకు అంచెలంచెలుగా సేవ చేస్తూ అందరినీ ఐక్యం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల ప్రశంసల జల్లు కురిపించారు. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ సైనికురాలిగా దేశ ప్రజల కోసం పని చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. విచ్చిన్న శక్తుల నుంచి ప్రజాస్వామిక విలువలను కాపాడేందుకు, రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - Jan 04 , 2024 | 04:15 PM