AP Elections: పండుగలా ఉండే వ్యవసాయాన్ని దండుగ చేశారు: షర్మిల
ABN , Publish Date - Apr 20 , 2024 | 09:15 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. కోడుమూరు ఎమ్మెల్యే, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. గుండ్రెవుల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కల అని, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నారని వివరించారు.
కర్నూలు జిల్లా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. కోడుమూరు ఎమ్మెల్యే, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. గుండ్రెవుల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కల అని, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నారని వివరంచారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టించుకున్న పాపాన పోలేదని విరుచుకుపడ్డారు. పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మరచిపోయారని మండిపడ్డారు.
Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
రైతులకు సాగునీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పండుగలా ఉండే వ్యవసాయాన్ని దండుగ చేశాడని మండిపడ్డారు. పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదని..యువతకు 2.35లక్షల ఉద్యోగాలు అని మోసం చేశారని వివరించారు. మేనిఫెస్టోలో ప్రతి అంశం అమలు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు అధికార వైసీపీకి పట్టవని షర్మిల విమర్శించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేవని, యువతకు ఉద్యోగాలు వచ్చేవని వివరంచారు. రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందని షర్మిల దుయ్యబట్టారు. ఏపీని రక్షించెంది కాంగ్రెస్ మాత్రమేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిచ్చారు.
AP Election 2024: గన్నవరంలో హీటెక్కిన రాజకీయం.. చర్చకు దారి తీసిన నామినేషన్
మరిన్ని ఏపీ వార్తల కోసం