కడప స్టీల్‌పై ప్రతిపాదనలు లేవనడం సిగ్గుచేటు
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:33 AM
కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించేలా ఉన్నాయ ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు రాష్ట్రానికి అవమానకరం
ఆ వ్యాఖ్యలపై ఏపీ ఎంపీలు మౌనంగా ఉంటారా?: షర్మిల
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించేలా ఉన్నాయ ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ప్రతిపాదనలే లేవని, వస్తే ఆలోచిస్తామని కుమారస్వామి చెప్పడం నిజంగా సిగ్గుచేటని, ఏపీ ప్రయోజనాలతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. మంగళవారం ఎక్స్ వేదికగా షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతగాని తనానికి నిదర్శ నమని విమర్శించారు. కడప ఉక్కు సీమ ప్రజల హక్కు అని చెప్పారు. కుమారస్వామి ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థిస్తారా? అసలు కడప స్టీల్ ప్లాంట్ కడతారా? లేదా అని ప్రశ్నించారు.