YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?
ABN , Publish Date - Apr 18 , 2024 | 03:53 PM
ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని.. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని ప్రజలను పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
మడకశిర, ఏఫ్రిల్ 18: ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని.. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.
AP Elections: మళ్లీ కుప్పం బయలుదేరిన భువనమ్మ
‘‘ పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ఎన్నికల సమయంలో సిద్దం పేరుతో బయటకు వస్తున్నారన్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా?’’ అని షర్మిల నిలదీశారు. సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రజాదర్బార్ ఉండేదని గుర్తుచేశారు. ఆయన వారసుడి పాలనలో అ ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని విమర్శించారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను సీఎం వైయస్ జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదని.. కానీ ఆ పార్టీ రాష్ట్రంలో రాజ్యమేలుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని చెప్పారు. రాష్ట్రానికి ఆ హోదా వచ్చి ఉంటే.. రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ మోసం చేసిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా వైయస్ షర్మిల స్పష్టం చేశారు.
Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా
ఆ హామీని పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తామని వైయస్ షర్మిల ప్రకటించారు. అలాగే ప్రతి మహిళకు 5 లక్షలతో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తామని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ నీవా ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి అయిందన్నారు. అయితే ప్రతిపక్షనేతగా వైయస్ జగన్ తాము అధికారంలోకి వస్తే.. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి.. తద్వారా 127 చెరువులకు నీరు ఇస్తామన్నారని గుర్తు చేశారు. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారని.. కానీ ఆయన ఆ హామీని విస్మరించారన్నారు.
Botsa: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?
అలాగే ఇండస్ట్రీయల్ కారిడార్ తీసుకు వస్తామని చెప్పారని.. కానీ ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేకపోయారని చెప్పారు. మడకశిర నియోజకవర్గం చుట్టు రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారని.. ఆ హామీ ఏమైందంటూ సీఎం వైయస్ జగన్‌ను ఆ పట్టణ ప్రజల సమక్షంలో వైయస్ షర్మిల ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం...