Share News

YS Sharmila : ప్రతిపక్ష నేత వెనుక వరుసలోనా..?

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:29 AM

దేశ ప్రజలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న రాహుల్‌ గాంధీని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వెనుక వరుసలో కూర్చోబెడతారా? అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila : ప్రతిపక్ష నేత వెనుక వరుసలోనా..?

  • మోదీకి ఇష్టమున్నా లేకున్నా ప్రజలు రాహుల్‌ను ఎన్నుకున్నారు: షర్మిల

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న రాహుల్‌ గాంధీని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వెనుక వరుసలో కూర్చోబెడతారా? అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ... ‘దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చింది కాంగ్రెస్సే. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వెనుక వరుసలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీని కూర్చోబెట్టడం ఏమిలి? మోదీకి ఇష్టమున్నా లేకున్నా దేశ ప్రజలు రాహుల్‌ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో రాహుల్‌ గాంధీ కలుస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.

బీజేపీ మతతత్వ పార్టీ. జాతీయ జెండాను బీజేపీ అవమానించింది. మూడు రంగుల జెండాను గౌరవించబోమని బీజేపీ చెప్పింది. ఒకే రంగు ఉండాలనడం ద్వారా త్రివర్ణ పతకాన్ని అవమానించింది’ అని షర్మిల అన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 03:31 AM