Share News

YSRCP MP Avinash : నా మొబైల్‌ పోయింది

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:02 AM

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వరుసగా రెండోరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.

 YSRCP MP Avinash : నా మొబైల్‌ పోయింది

  • సోషల్‌ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్‌ గుర్తులేదు

  • రెండోరోజు విచారణలో అవినాశ్‌ పీఏ రాఘవరెడ్డి

కడప, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వరుసగా రెండోరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. మాజీ సీఎం జగన్‌ తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్‌తోనే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టానని వర్రా రవీంద్రారెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. దీంతో రాఘవరెడ్డిపైనా కేసు నమోదు చేశారు. కడప సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌లో పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ ఆధ్వర్యంలో అతడిని రెండు రోజులుగా విచారిస్తున్నారు. వర్రా రవీంద్రరెడ్డి ఎవరో తనకు తెలియదని సోమవారం చెప్పిన రాఘవరెడ్డి.. మంగళవారం నాటి విచారణలో 20రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌ పోయిందని తెలిపారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇతర సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌ తనకు తెలియదని చెప్పారు.

షర్మిలపై మీరు ఇచ్చిన కంటెంట్‌నే పోస్టు చేశానంటూ వర్రా రవీంద్రరెడ్డి స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, అందుకు డబ్బులు కూడా ఇచ్చారట కదా అని పోలీసులు ప్రశ్నించగా... అసలు వర్రా ఎవరో తనకు తలియదని, అతనితో మాట్లాడనే లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే షర్మిలపై అసభ్య పోస్టులు పెట్టిన తరువాత ఒక్కో పోస్టుకు రూ.13,500 చొప్పున వర్రాకు బండి చెల్లించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. వాటిపై ప్రశ్నించగా తనకేం తెలియదన్నారని సమాచారం. మంగళవారం దాదాపు 10గంటల పాటు విచారణ సాగింది. రాఘవరెడ్డి వెంట ఆయన తరఫు న్యాయవాది వచ్చారు. పోలీసులు బుధవారం కూడా విచారణకు రావాలని రాఘవరెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చారు.

Updated Date - Dec 11 , 2024 | 05:04 AM