Ekagrah Rohan: 5 నెలల బుడ్డోడు, రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు.. ఎలాగంటే
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:20 PM
ఓ ఐదు నెలల బాలుడు ఏకంగా కోటిశ్వరుడిగా మారిపోయారు. ఇంత తక్కువ వయస్సులో ఏలా అంత సంపాదించాడు. ఆ విశేషాలేంటనేది ఇప్పుడు చుద్దాం. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్(Ekagrah Rohan) ఈ ఘనతను సాధించారు.
ఓ ఐదు నెలల బాలుడు ఏకంగా కోటిశ్వరుడిగా మారిపోయారు. ఇంత తక్కువ వయస్సులో ఏలా అంత సంపాదించాడు. ఆ విశేషాలేంటనేది ఇప్పుడు చుద్దాం. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్(Ekagrah Rohan) ఈ ఘనతను సాధించారు. ఏకాగ్రహ్ రోహన్‌కి నారాయణ మూర్తి గత నెలలో 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇవ్వడంతో ఇప్పుడు కోటిశ్వరుడిగా మారిపోయారు.
ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్(infosys) కంపెనీ ఇటివల Q4 ఫలితాలను ప్రకటించింది. ఆ తర్వాత చివరి డివిడెండ్ రూ.20, రూ.8 ప్రత్యేక డివిడెండ్‌తో సహా మొత్తం రూ.28 డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఏకాగ్రహ్ రోహన్ మూర్తి డివిడెండ్ రూపంలో రూ.4.2 కోట్ల ఆదాయం సంపాదించారు.
ఈ ఐటీ కంపెనీ ఏప్రిల్ 18న తుది డివిడెండ్, ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. గత నెలలో నారాయణమూర్తి(Narayana Murthy) ఏకాగ్రహ్ కు రూ.240 కోట్లకు పైగా షేర్లను బహుమతిగా ఇచ్చారు. దీంతో ఏకాగ్రహ్ భారత్‌లోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీలో 15 లక్షల షేర్లు లేదా 0.04% వాటాను దక్కించుకున్నారు. ఇక బహుమతిగా ఇచ్చినప్పటి నుంచి ఒక్కో షేరు దాదాపు రూ.200 మేర పతనమవడంతో ఏకాగ్రహ్ కు చెందిన ఇన్ఫోసిస్ షేర్ల మొత్తం విలువ రూ.30 కోట్లు క్షీణించింది. అంటే ఏప్రిల్ 19న ఉదయం 11:15 గంటలకు ఇన్ఫోసిస్ షేర్లు 1.2% తగ్గి రూ.1,402.4 వద్ద ట్రేడవుతున్నాయి.
నారాయణ్ మూర్తి, సుధా మూర్తి కుమారుడు రోహన్ మూర్తి(Rohan Murthy), అతని భార్య అపర్ణ(Aparna Krishnan) నవంబర్ 2023లో కుటుంబంలోని కొత్త సభ్యుని రాకను ప్రకటించారు. కుటుంబంలోని కొత్త సభ్యునికి ఏకాగ్రహ్ అని పేరు పెట్టారు. నారాయణ్ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి, రిషి సునాక్ (అల్లుడు)కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల నారాయణ మూర్తి భార్య సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం