Stock Market: ఎన్నికల వేళ స్టాక్ మార్కెట్ పతనం..కొద్దిసేపట్లోనే 4 లక్షల కోట్లు ఖతం
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:08 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) శుక్రవారం (ఏప్రిల్ 19న) షార్ప్ కరెక్షన్ కనిపించింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత, దేశంలో లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశాల ఒత్తిడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) శుక్రవారం (ఏప్రిల్ 19న) షార్ప్ కరెక్షన్ కనిపించింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత, దేశంలో లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశాల ఒత్తిడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం ఒక దశలో సెన్సెక్స్(sensex) దాదాపు 600 పాయింట్లు పడిపోయి 72000 దిగువకు చేరగా, నిఫ్టీ(nifty) కూడా 150 పాయింట్లు పతనమై 21800 స్థాయికి చేరుకుంది. దీంతో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 250, 705 పాయింట్లు కోల్పోయాయి.
ఈ క్రమంలో BPCL, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, HCL టెక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, ONGC, అపోలో హాస్పిటల్, ITC, భారతి ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఐటీ, మెటల్, ఆటో, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో మార్కెట్‌లో గరిష్ట అమ్మకాలు నమోదవుతున్నాయి. ఫలితాల తర్వాత ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి.
అంతకుముందు గురువారం సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయి 72,488 వద్ద ముగిసింది. ఏప్రిల్ 18న క్రితం సెషన్‌లో నమోదైన రూ. 393.38 లక్షల కోట్లతో పోలిస్తే ఈరోజు ఇన్వెస్టర్లు రూ. 4.18 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో మార్కెట్ విలువ రూ. 389 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇది కూడా చదవండి:
SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి
Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం