Investors: స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. ఇన్వెస్టర్లకు ఇదే బెస్ట్ ఛాన్స్!
ABN , Publish Date - Aug 05 , 2024 | 07:20 PM
గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు(stock market) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు కూడా భారత స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలతో ముగిసింది. అయితే ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు(investors) ఆందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్‌లో భారీగా పతనమైన మంచి షేర్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని అంటున్నారు.
గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు(stock market) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు కూడా భారత స్టాక్ మార్కెట్ కూడా తీవ్ర నష్టాలతో ముగిసింది. అయితే ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు(investors) ఆందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల కారణంగా భారత మార్కెట్‌లో క్షీణత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పోర్ట్‌ఫోలియోలో మీకు మంచి షేర్లు ఉంటే వాటికే కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. అవి మరికొన్ని రోజుల్లో మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో మార్కెట్‌లో భారీగా పతనమైన మంచి షేర్లలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మీరు గతంలో మంచి స్టాక్‌లలో భారీ పెరుగుదల ఉన్నందున వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లయితే ఇప్పుడు వాటిని మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడానికి మీకు మంచి అవకాశం ఉందన్నారు.
ఏం చేయాలంటే
ఇదే సమయంలో మీ పోర్ట్‌ఫోలియోలోని కొన్ని స్టాక్‌లు(stocks) భారీ లాభాలను ఇస్తుంటే వాటి నుంచి డబ్బును ఉపసంహరించుకోవాలని చెబుతున్నారు. వాటిని విక్రయించి చౌక ధరకు లభించే స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ విధంగా మీరు మీ పోర్ట్‌ఫోలియోను లాభాల బాటలో చేసుకోవచ్చని అంటున్నారు. అంతేకాదు మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే మార్కెట్ క్షీణత మీకు సువర్ణావకాశమని చెప్పవచ్చు.
అధిక రాబడి
ఈ పతనంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు అధిక రాబడిని పొందవచ్చు. ఈ సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడి దారులు మార్కెట్ క్షీణతకు భయపడకూడదని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ స్టాక్‌తో కట్టుబడి ఉండాలని, దీర్ఘకాలంలో మీరు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అయితే మార్కెట్లో పెట్టుబడి పెట్టే విషయంలో మార్కెట్ మరింత పతనమయ్యే అవకాశం ఉందో లేదో తెలుసుకుని పెట్టుబడి చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Accounts: ఒకరికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి.. ఎక్కువ ఉంటే ఇబ్బందులేంటి?
ఏ స్టాక్స్ ఎక్కువగా పడిపోయాయి?
ఇక నేడు దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టపోయిన టాప్ స్టాక్‌లలో టాటా మోటార్స్ (-7.40%), ONGC (-6.39%), అదానీ పోర్ట్స్ (-5.92%), టాటా స్టీల్ (-5.61%), హిందాల్కో (-5.25%), టాటా స్టీల్ (-5.03%) ఉన్నాయి. టాప్ లాభాల స్టాక్స్‌లలో హిందుస్థాన్ యూనిలీవర్ (1.02%), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (0.70%), నెస్లే ఇండియా (0.68%), బ్రిటానియా (0.51%), హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ (0.21%) కలవు. గతంలో ఈ కంపెనీల స్టాక్స్ ఒకే నెలలోనే పెద్ద ఎత్తున పెరిగాయి. ఇదే సమయంలో నిక్కీ దాదాపు 13% పతనమైంది. కొరియా, తైవాన్, ఆస్ట్రేలియా వంటి ఇతర మార్కెట్లు కూడా 2.5%, 7% మధ్య క్షీణించాయి.
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News