Share News

Lok Sabha Polls: మరింత ప్రియం కానున్న టెలికాం సేవలు!

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:35 AM

దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగం గా టెలికాం కంపెనీలు ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత...

Lok Sabha Polls: మరింత ప్రియం కానున్న టెలికాం సేవలు!

  • లోక్‌సభ ఎన్నికల తర్వాత టెలికాం చార్జీల బాదుడు!?

  • 15-20 శాతం పెంపు తప్పదు

న్యూఢిల్లీ: దేశంలో టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్‌పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా టెలికాం కంపెనీలు (Telecom Companies) ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత చార్జీలు పెంచే అవకాశాలున్నాయి. దాదాపు రెండున్నరేళ్ల్లపాటు చార్జీలను స్థిరంగా కొనసాగించిన టెల్కోలు.. ఈసారి 15- 20 శాతం వరకు పెంచవచ్చని బ్రోకరేజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. జూలై-అక్టోబరు మధ్యకాలంలో ఈ పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నాయి. అయితే, అల్పాదాయ వర్గ వినియోగదారులు సైతం భరించగలిగేలా కంపెనీలు చార్జీల పెంపు ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులంటున్నా రు. 2021 నవంబరులో టెల్కోలు టారి్‌ఫను 20-25 శాతం వరకు పెంచాయి.

అమెరికా మార్కెట్‌కు అమూల్‌ పాలు

భారతీ ఎయిర్‌టెల్‌ తొలుత చార్జీల పెంపును ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థలంటున్నాయి. మిగతా ప్రైవేట్‌ ఆపరేటర్లు జియో, వొడాఫోన్‌ ఐడియా పెంపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. మిగతా కంపెనీలూ ఎయిర్‌టెల్‌ బాటను అనుసరించనున్నాయని కొందరంటుండగా.. జియో మాత్రం తన వినియోగదారుల డేటా వినియోగం పెంపు ద్వారా ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాన్ని అనుసరించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ప్రతినెలా కస్టమర్లను కోల్పోతున్న వొడాఫోన్‌ ఐడియా.. చార్జీలను పెంచే సాహసం చేయకపోవచ్చన్న వాదనలూ విన్పిస్తున్నాయి. అయితే, 5జీ స్పెక్ట్రమ్‌, నెట్‌వర్క్‌ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన టెల్కోలకు ఆదాయాన్ని పెంచుకోవడం అత్యవసరంగా మారింది. గత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి ఎయిర్‌టెల్‌ ఆర్పూ రూ.208కి చేరింది. జియో ఆర్పూ రూ.182, వొడా ఐడియా సగటు రెవెన్యూ మాత్రం కనిష్ఠంగా రూ.145గా నమోదైంది. ఈసారి చార్జీల పెంపుతో ఎయిర్‌టెల్‌ ఆర్పూ రూ.260 స్థాయికి చేరుకోవచ్చని బెర్న్‌స్టీన్‌ అంచనా వేసింది.

AP Elections: రఘురామకు పశ్చిమలో సీటు!


Updated Date - Mar 26 , 2024 | 08:33 AM