Alert: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..
ABN , Publish Date - Oct 02 , 2024 | 09:00 PM
మీరు పండుగల కోసం ఇంటికి వెళ్లేందుకు ట్రైన్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారా. అయితే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్ అక్టోబర్ 3 నుంచి మొదలవుతుంది.
మీరు దసరా, దీపావళి కోసం ఇంటికి వెళ్లడానికి ఇప్పటి నుంచే రైలు టిక్కెట్లను(train tickets) బుక్ చేసుకోవాలని భావిస్తున్నారా. అయితే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్ అక్టోబర్ 3 నుంచి మొదలవుతుంది. ఇది దీపావళి, ఛత్ వరకు కొనసాగుతుంది. ఇది వెలుగుల పండుగ, ప్రజలు ఈ రోజును చాలా వైభవంగా జరుపుకుంటారు. అదే సమయంలో అనేక ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా వారి సొంత గ్రామాలకు చేరుకుంటారు. అందుకోసం కొంత మంది సొంత వాహనంలో, మరికొందరు రైలు, తదితర మార్గాల్లో ఇళ్లకు చేరుతుంటారు.
బుక్ చేసే విషయంలో..
ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఈ దీపావళికి ఇంటికి వెళ్లడానికి రైలు ప్రయాణం కోసం టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నట్లయితే కొన్ని విషయాలను మాత్రం తప్పక గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ దీపావళికి ఇంటికి రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని మోసానికి గురి చేస్తుంది. కాబట్టి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ తప్పులతో
దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్లేందుకు అందరూ దాదాపు కన్ఫర్మ్ రైలు టిక్కెట్‌ను పొందలేరు. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు బ్రోకర్ల సహాయం తీసుకుంటారు. వీరిలో కొంత మంది డబ్బులు ముందుగా తీసుకుని మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వారు మీకు ధృవీకరించబడిన రైలు టిక్కెట్‌లను ఇవ్వలేరు. అందువల్ల ఎల్లప్పుడూ విశ్వసనీయ బ్రోకర్‌ని సంప్రదించండి లేదా తత్కాల్ రైలు టిక్కెట్‌లను మీరే బుక్ చేసుకోవడం ఉత్తమం.
ఫేక్ యాప్స్
దీంతోపాటు ఈ పండుగ సీజన్‌లో ఫేక్ యాప్‌లు, వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలి. వాస్తవానికి మోసగాళ్లు మీరు మోసపోయిన ఒరిజినల్ వాటి మాదిరిగానే యాప్‌లు, వెబ్‌సైట్‌లను సృష్టిస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ IRCTC అధికారిక యాప్ నుంచి లేదా అధికారిక పోర్టల్ irctc.co.in/nget/train-search నుంచి మాత్రమే ఆన్‌లైన్ టిక్కెట్‌లను బుక్ చేసుకోండి. తద్వారా మీరు మోసాన్ని నివారించుకోవచ్చు.
నంబర్ల చెక్
దీపావళి సందర్భంగా మీరు ఫేక్ కాల్‌లకు దూరంగా ఉండాలి. లేకపోతే మీ చిన్న పొరపాటు మిమ్మల్ని మోసానికి గురి చేస్తుంది. వాస్తవానికి ప్రజలు రైల్వే కస్టమర్ కేర్‌తో మాట్లాడటానికి Googleలో నంబర్‌లను సెర్చ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు మోసగాళ్లు అప్‌డేట్ చేసిన తప్పు నంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో ఏదైనా సలహాల కోసం భారతీయ రైల్వేల అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 139ని సంప్రదించండి.
తెలియని వాటిపై క్లిక్ చేయోద్దు
మీరు మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే దీపావళికి ముందే రైలు టిక్కెట్‌ను అధికారిక వెబ్‌సైట్స్ లేదా యాప్స్ నుంచి బుక్ చేసుకోండి. ఆ క్రమంలో చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి సందేశాలు, ఇమెయిల్‌లు మొదలైన వాటిని పంపిస్తుంటారు. కాబట్టి మీరు తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు. మీరు పొరపాటున కూడా తెలియని లింక్‌లను క్లిక్ చేయకూడదు. లేకుంటే మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
Read More Business News and Latest Telugu News