Share News

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

ABN , Publish Date - May 15 , 2024 | 03:28 PM

ఇటివల కాలంలో క్రెడిట్ కార్డు(Credit Card) వాడకం సర్వ సాధారణం అయిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటివల పలువురు దుండగులు మాత్రం ఈ క్రెడిట్ కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతూ అనేక మందిని చీట్ చేస్తున్నారు. అయితే ఇటివల వెలుగులోకి వచ్చిన క్రెడిట్ కార్డు మోసాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
credit card scams

ఇటివల కాలంలో క్రెడిట్ కార్డు(Credit Card) వాడకం సర్వ సాధారణం అయిపోయింది. దాదాపు అనేక మంది ఉద్యోగులు, వ్యాపారులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటివల పలువురు దుండగులు మాత్రం ఈ క్రెడిట్ కార్డుల పేరుతో మోసాలకు పాల్పడుతూ అనేక మందిని చీట్ చేస్తున్నారు. అయితే ఇటివల వెలుగులోకి వచ్చిన క్రెడిట్ కార్డు మోసాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


పలువురు దుండగులు అనేక మందికి ఫోన్(call) చేసి మీ క్రెడిట్ కార్డు వాడకం ద్వారా మీరు బహుమతులు(gifts) గెల్చుకున్నారని, వాటిని తీసుకోవాలంటే ఓటీపీ(OTP) చెప్పాలని కాల్ చేసి మనీ దోచుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ట్రావెల్ లేదా ఇతర బస్సు లేదా ఫ్లైట్ టిక్కెట్లపై ఆఫర్ ఉందని ఫోన్ చేసి స్కాం చేస్తున్న ఘటనలు కూడా బయటకొచ్చాయి. మరోవైపు రెస్టారెంట్లలో క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఆఫర్‌లు, తగ్గింపులు అందుబాటులో ఉన్నాయని మీకు మేసెజ్ పంపిస్తారు. ఆ క్రమంలో వాటిని క్లిక్ చేసి మీ సమచారం ఇస్తే అంతే సంగతులు. మీ బ్యాంకు ఖాతా నుంచి నగదును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.


ఈ క్రమంలో ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్యాంకు అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. అయితే మీ క్రెడిట్ కార్డ్ విషయంలో ఏదైనా మోసం జరిగిందని అనిపిస్తే వెంటనే మీ సంబంధిత బ్యాంకుకు సమాచారం తెలిపాలి. దీంతోపాటు మీ క్రెడిట్ కార్డు పోవడం, చోరీకి గురి కావడం జరిగినా కూడా బ్యాంకు అధికారులకు సమాచారం తెలపాలి. అప్పుడు బ్యాంకు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లేదా సైబర్ క్రైం(cyber crime) జరిగి నగదు కోల్పోయినా కూడా వెంటనే ఫిర్యాదు చేస్తే క్యాష్ తిరిగి పొందే అవకాశం ఉంటుంది.


ఇది కూడా చదవండి:

ఎఫ్‌ అండ్‌ ఓ పెట్టుబడులపై జాగ్రత్త!

Lok Sabha Elections 2024: పీఓకే మనదే, వెనక్కి తెస్తాం: అమిత్‌షా


Read Latest Business News and Telugu News

Updated Date - May 15 , 2024 | 03:32 PM