Home » Cyber attack
డీహెచ్ఎల్ కొరియర్ సర్వీసు పేరుతో ముంబై నుంచి చైనాకు వెళ్తున్న పార్శిల్లో చట్టవ్యతిరేక వస్తువులు దొరికాయంటూ నగరానికి చెందిన యువకుడిని సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) బెదిరించి రూ. 6.90 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేసిన డబ్బును రికవరీ చేసిన సైబర్‌క్రైం పోలీసులు బాధితుడి ఖాతాలో జమ చేయించారు. బ్యాంకు అధికారులమంటూ నగరానికి చెందిన వ్యక్తికి ఫోన్‌చేసిన సైబర్ నేరగాళ్లు.. క్రెడిట్ కార్డు లిమిట్(Credit card limit) పెంచుతామని చెప్పారు.
ఆన్లైన్ పార్ట్‌టైం జాబ్ పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(25) ఆన్లైన్ పార్ట్‌టైం జాబ్(Online part-time job) ప్రకటన చూసి వారిని సంప్రదించాడు. చిన్నపాటి టాస్క్‌లు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపులో చేర్చారు.
పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మోసం చేసి కాజేసిన డబ్బును అమాయకుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ లావాదేవీలు జరిగిన ఖాతాలను పోలీసు అధికారులు ఫ్రీజ్ చేస్తున్నారు.
డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లు, ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, హనీ ట్రాప్ వంటి ఆన్లైన్ మోసాలు రోజురోజుకి అధికమవుతున్న వేళ యూజీసీ అప్రమత్తమైంది.
ఫుడ్ ఆర్డర్ చేసి, క్యాన్సిల్ చేసిన మహిళను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals), ఏపీకే లింక్‌ను పంపి రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన గృహిణి(38) జెప్టో యాప్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసింది.
స్టాక్ మార్కెట్లో టిప్స్ చెప్తానని.. యువకుడ్ని నమ్మించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) అతడి వద్ద నుంచి రూ.16.25 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులకు(City Cybercrime Police) ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి Lazardoo vip టాప్ అనే సైబర్ ముఠా భారీ లాభాల ఆశ చూపింది. తాము చెప్పిన చోట పెట్టుబడి పెడితే కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. రూ.100 పెడితే రూ.200లు వస్తాయని నమ్మ బలికారు.
ఎక్కువ లిమిట్‌తో కొత్త క్రెడిట్ కార్డు(Credit card) ఇస్తామని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు 68 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ. 2.19 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశారు.
దేశ వ్యాప్తంగా నాలుగేళ్లలో సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రూ.3,207 కోట్లు కొల్లగొట్టారు. పండగల సీజన్లోనే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్(Right to Information Act) ద్వారా ఆర్బీఐ ఇచ్చిన వివరాల తెలుస్తోంది. 2020 నుంచి 2024 వరకు సైబర్ నేరాలకు సంబంధించి 5,82,000 కేసులు నమోదయ్యాయి.