Bank Holidays in July: జులై నెలలో ఈ తేదీల్లో బ్యాంకులకు సెలవులు
ABN , Publish Date - Jun 25 , 2024 | 07:52 AM
ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా జులై నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేసి(Bank Holidays in July) ఉంటాయి. ఆర్బీఐ విడుదల చేసి సెలవుల జాబితా ప్రకారం.. జులైలో రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూసి ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా జులై నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేసి(Bank Holidays in July) ఉంటాయి. ఆర్బీఐ విడుదల చేసి సెలవుల జాబితా ప్రకారం.. జులైలో రెండు, నాలుగో శనివారాలు సహా 12 రోజులపాటు బ్యాంకులు మూసి ఉంటాయి.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తూనే ఉంటాయి, కస్టమర్‌లు తక్షణ అవసరాల కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ATMల ద్వారా లావాదేవీలు కొనసాగించవచ్చు. అయితే, బ్యాంకులు మూసి ఉన్న తేదీలను గమనించి.. బ్యాంకు శాఖల సందర్శనలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు కస్టమర్లను కోరుతున్నారు. బ్యాంక్ హాలీడేస్ లిస్ట్ చూద్దాం..
జులై 3: షిల్లాంగ్, మేఘాలయాల్లో బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
జులై 6: ఎంహెచ్ఐపీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
జులై 7: ఆదివారం సెలవు.
జులై 8: మణిపూర్‌లో రథ యాత్ర సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
జులై 9: సిక్కింలో ద్రుప్‌కా షిజి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
జులై 13: రెండో శనివారం.
జులై 14: ఆదివారం
జులై 16: హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు.
జులై 17: మొహర్ర, అషూరా, యు తిరోత్ సింగ్ డే సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, ఏపీ, తెలంగాణ, జమ్మూ, జైపుర్, ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, కోల్‌కతా, కాన్‌పుర్, లఖ్‌నవూ, రాంచీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
జులై 21: ఆదివారం
జులై 27: నాలుగో శనివారం కావడంతో బ్యాంకుకు సాధారణ సెలవు.
జులై 28: ఆదివారం
For Latest News and National News click here