Drone Delivery: తొలి డ్రోన్ డెలివరీ సక్సెస్.. స్కైఎయిర్‌తో బ్లూడార్ట్ ఒప్పందం
ABN , Publish Date - Jun 20 , 2024 | 07:10 AM
డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీని తొలిసారి విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్(Blue Dart) తెలిపింది. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తన రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడానికి డ్రోన్ సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నట్లు బ్లూడార్ట్ వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీని తొలిసారి విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్(Blue Dart) తెలిపింది. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. తన రవాణా వ్యవస్థలను మెరుగుపర్చుకోవడానికి డ్రోన్ సాంకేతికతనూ ఉపయోగించుకుంటున్నట్లు బ్లూడార్ట్ వెల్లడించింది.
2021 సెప్టెంబర్లో హైదరాబాద్‌లోని వికారాబాద్‌లో విజువల్ లైన్ ఆఫ్ సైట్ (VLOS) ట్రయల్స్, 'మెడిసిన్ ఫ్రమ్ ది స్కై' కింద బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS) ట్రయల్స్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ-కామర్స్ రంగంపై దృష్టి సారిస్తున్నామని, డ్రోన్ల ద్వారా షిప్‌మెంట్లను ఒకే రోజులో డెలివరీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
వీటి వల్ల డెలివరీ సమయం బాగా తగ్గుతుందని, పర్యావరణంపై ప్రతికూల ప్రభావమూ అదుపులోకి వస్తుందని కంపెనీ ఎండీ బాల్ఫోర్ మాన్యుయెల్ తెలిపారు.దేశ వ్యాప్తంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో వృద్ధి, డ్రోన్ సాంకేతికత అద్భుతాలు చేస్తుందని.. దీంతో ఈ సేవలను మరింత విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు.
ఆయన తన ప్రకటనలో డ్రోన్ డెలివరీలు అందుబాటులో ఉండే ప్రాంతాలు వాటిల్లో ఇమడగలిగే బరువు తదితర వివరాల గురించి చెప్పలేదు. గురుగ్రామ్‌లో స్కై ఎయిర్ సీఈఓ అంకిత్ కుమార్ డ్రోన్ డెలివరీలను ప్రకటించిన ఒక రోజు తర్వాత బ్లూడార్ట్ ప్రకటన వెలువడింది. ట్రాఫిక్ రద్దీ, పర్యావరణ సమస్యలను డ్రోన్ల వాడకంతో చెక్ పెట్టొచ్చని కుమార్ అన్నారు. భవిష్యత్తులో డ్రోన్ల డెలివరీదే రాజ్యం అని స్పష్టం చేశారు.
For Latest News and National News click here