Budget 2024: ఉద్యోగుల అంచనాలను నెరవేరుస్తుందా..ఈ డిమాండ్స్ చుశారా?
ABN , Publish Date - Jan 29 , 2024 | 07:43 PM
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సాధారణ ప్రజలకు గరిష్ట ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధిపథంలో ఉంచాలని ప్రణాళికలను తయారు చేస్తుంది.
ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పిస్తారు. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సాధారణ ప్రజలకు గరిష్ట ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధిపథంలో ఉంచాలని ప్రణాళికలను తయారు చేస్తుంది. ఈ క్రమంలో సాధారణ ప్రజల నుంచి ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు సైతం బడ్జెట్‌పై చాలా అంచనాలను పెట్టుకున్నాయి. అయితే ఈ బడ్జెట్ నుంచి ప్రధానంగా ఉద్యోగులు ఆశిస్తున్న అంశాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Indian Economy: మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్: ఫైనాన్స్ మినిస్ట్రీ
ఉద్యోగుల డిమాండ్స్
2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును ప్రభుత్వం పెంచాలని కొంత మంది ఉద్యోగులు కోరుతున్నారు. ప్రాథమిక పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆదాయపు పన్ను శ్లాబ్‌ను 10 శాతం, 20 శాతం, 30 శాతాలను మరింత మార్చాలని అంటున్నారు.
అదనంగా సర్‌ఛార్జ్, సెస్‌లను కూడా తొలగించాలని చెబుతున్నారు. మరోవైపు ఉపాధి కూలీలకు జీతం తప్ప మరే ఇతర ఆదాయ వనరులు లేవని అంటున్నారు. కాబట్టి యజమాని ద్వారా తీసివేయబడిన TDS ఇప్పటికే ఆదాయపు పన్ను పోర్టల్‌లో ప్రీపెయిడ్ చేయబడాలని కోరుతున్నారు.
ఆదాయపు పన్ను శ్లాబు మార్పు
గతేడాది సామాన్యులకు ఊరటనిస్తూ కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను మినహాయింపును ప్రభుత్వం రూ.7 లక్షలకు పెంచింది. అలాగే రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చింది. దీని తరువాత కొత్త పన్ను విధానంలో జీతం పొందే వారి ఆదాయం రూ.7.50 లక్షల వరకు పన్ను రహితంగా మారింది.
మధ్యంతర బడ్జెట్
అయితే ఈ ఏడాది ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 1న వచ్చే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కానుంది. మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన వసూళ్లు, ఖర్చుల వివరాలు మాత్రమే ఉండనున్నాయి. దీనిని ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించింది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్‌లో అన్ని అంశాలకు సంబంధించిన మార్పులు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.