Share News

CAIT: రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం..దేశంలో లక్ష కోట్ల వ్యాపారం!

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:15 PM

జనవరి 22న జరగనున్న అయోధ్య(Ayodhya)లో రామ మందిర(Ram temple) ప్రతిష్ఠాపన కార్యక్రమంతో దేశంలో లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని ట్రేడర్స్ బాడీ CAIT సోమవారం తెలిపింది. వివిధ రాష్ట్రాలలోని 30 నగరాలకు చెందిన వర్తక సంఘాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అంచనా వేసినట్లు వెల్లడించింది.

CAIT: రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం..దేశంలో లక్ష కోట్ల వ్యాపారం!

అయోధ్య(Ayodhya)లో ఈనెల 22న రామమందిరం(Ram temple) ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరగనుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య (CAIT) తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా మతపరమైన భావాలను ప్రతిధ్వనించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో కూడా ఊపును తెస్తుందని CAIT జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 నగరాలకు చెందిన వర్తక సంఘాల నుంచి అందిన సమాచారం ఆధారంగా అంచనా వేసినట్లు తెలిపారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Betavolt: వావ్.. కొత్త బ్యాటరీ..50 ఏళ్లకు సరిపడా చార్జింగ్! ఇక చార్జర్ల అవసరం లేనట్టేనా?

ప్రజల విశ్వాసం దేశంలోని సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడిన అనేక కొత్త వ్యాపారాలకు దారి తీస్తోందని CAIT జనరల్ సెక్రటరీ తెలిపారు. రామ మందిర ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సుమారు 30 వేల వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. వీటిలో మార్కెట్‌లో ఊరేగింపులు, శ్రీరామ్ చౌకీ, శ్రీరామ్ ర్యాలీలు, శ్రీరామ్ పద్ యాత్ర, స్కూటర్, కార్ ర్యాలీలు, శ్రీరామ్ సభలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అందుకోసం శ్రీరాముడి జెండాలు, బ్యానర్లు, క్యాప్‌లు, టీ షర్టులు, రామాలయం చిత్రం ఉన్న కుర్తాలకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉందని గుర్తు చేశారు.

రామాలయ నమూనాలకు డిమాండ్‌ పెరిగిందని అన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా మోడళ్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ చెప్పారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో చిన్నపాటి తయారీ యూనిట్లు పగలు, రాత్రి పని చేస్తున్నాయని గుర్తు చేశారు. వచ్చే వారం ఢిల్లీలో 200కు పైగా ప్రధాన మార్కెట్‌లు, పెద్ద సంఖ్యలో చిన్న మార్కెట్‌లలో శ్రీరామ జెండాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jan 15 , 2024 | 09:16 PM