Central Govt : మరో విడత ‘వివాద్ సే విశ్వాస్’
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:09 AM
ప్రత్యక్ష పన్ను వివాదాల పరిస్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ప్రవేశ పెడుతోంది. వివాద్ సే విశ్వాస్ 2.0 పేరుతో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వివాదాల పరిస్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘వివాద్ సే విశ్వాస్’ పథకం ప్రవేశ పెడుతోంది. వివాద్ సే విశ్వాస్ 2.0 పేరుతో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ స్కీమ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జూలై 22వ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న ప్రత్యక్ష పన్నుల వివాదాలను ఈ స్కీమ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. 2020లో ప్రవేశపెట్టిన వివాద్ సే విశ్వాస్ 1.0 స్కీమ్ ద్వారా దాదాపు రూ.75,000 కోట్ల ప్రత్యక్ష పన్ను వివాదాలు పరిష్కారం కావడంతో ప్రభుత్వం మరోసారి ఈ స్కీమ్‌ను తీసుకొస్తోంది. వివాద్ సే విశ్వాస్ 1.0 ద్వారా 1.2 లక్షల ప్రత్యక్ష పన్నుల వివాదాలు పూర్తయినా, ఇంకా రూ.35 లక్షల కోట్ల మొత్తానికి సంబంధించి 2.7 కోట్ల పన్ను వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. వివాద్ సే విశ్వాస్ 2.0 ద్వారా ఇందులో కొన్నిటినైనా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.