Holidays: రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు.. కారణమిదే..
ABN , Publish Date - Aug 08 , 2024 | 09:19 PM
రేపు నాగుల పంచమి. ఈ పండుగను దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులు సహా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అనే సందేహం కూడా అనేక మందిలో మొదలైంది.
రేపు నాగుల పంచమి. ఈ పండుగను దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిర్వహిస్తారు. అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులు సహా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయా అనే సందేహం కూడా అనేక మందిలో మొదలైంది. అయితే భారత సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకారం ఆగస్టు 9, 2024న బ్యాంకులు తెరిచే ఉంటాయి.
కానీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9, 2024న ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ సెలవు దినంగా(holiday) ప్రకటించింది. ఈ సెలవు రాష్ట్రం మొత్తం హాలిడేగా వర్తిస్తుంది. దీంతో స్కూళ్లు, కాలేజీలతోపాటు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా బంద్ ఉంటాయి.
వరుసగా
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రలో అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతాయి. అయితే ఇప్పటికే శుక్రవారం హాలిడే ప్రకటించగా, రెండో శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు సహా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. దీంతో వరుసగా ఇక్కడి ఉద్యోగులు, విద్యార్థులకు మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చేశాయి.
ఆగస్టులో ఇంకా అనేక రోజుల్లో సెలవులు ఉండబోతున్నాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆ క్రమంలో ఆగస్టు 17న శనివారం, ఆగస్టు 18న ఆదివారం, ఆగస్టు 19న రక్షాబంధన్ సెలవులు కూడా ఉన్నాయి. దీని తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా ఆగస్టు 24న శనివారం, ఆగస్టు 25 ఆదివారం, ఆగస్టు 26న కూడా హాలిడేలు ఉన్నాయి.
ఆగస్టులో ఇంకా ఏ రోజుల్లో బ్యాంకులు బంద్
దీంతోపాటు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. దీని తరువాత ఆగస్టు 18న ఆదివారం, రక్షా బంధన్ కారణంగా ఆగస్టు 19న బ్యాంకులకు సెలవు. దీని తర్వాత నాల్గవ శనివారం కారణంగా ఆగస్టు 24న, ఆదివారం కారణంగా ఆగస్టు 25న కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. కాబట్టి ఈనెలలో సెలవులు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు కూడా ఉంటాయి. కాబట్టి ఏదైనా బ్యాంకు పనులు ఉంటే సెలవుల గురించి తెలుసుకుని ఆయా పనుల కోసం వెళ్లండి.
ఇవి కూడా చదవండి:
Home Loans: ఈ హోమ్ లోన్స్ తీసుకునే వారికి షాకింగ్... ఆర్బీఐ కీలక నిర్ణయం
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News